Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 70వ స్వాతంత్ర్య సంవత్సర వేడుకల ఆరంభ సూచకంగా జెండాను ఊపి ‘తిరంగా యాత్ర’ ను ప్రారంభించారు;

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 70వ స్వాతంత్ర్య సంవత్సర వేడుకల ఆరంభ సూచకంగా జెండాను ఊపి ‘తిరంగా యాత్ర’ ను ప్రారంభించారు;


గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ కు ఆయన జన్మస్థలమైన మధ్య ప్రదేశ్ అలీరాజ్ పూర్ జిల్లా లోని భాబ్రా లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మృత్యంజలిని ఘటించారు. అలాగే, శహీద్ చంద్రశేఖర్ ఆజాద్ స్మారకాన్ని ప్రధాన మంత్రి సందర్శించి ఆజాద్ విగ్రహానికి పూలమాలను అలంకరించారు.

ప్రధాన మంత్రి ఒక బహిరంగ సభలో పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశాన్ని వదలిపెట్టి బ్రిటిషు వారు వెళ్లిపోవాలంటూ మహాత్మ గాంధీ ”క్విట్ ఇండియా” నినాదాన్ని ఇచ్చింది ఈ రోజే.. అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తుచేశారు. మనం స్వేచ్ఛావాయువులను శ్వాసించేటందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను జ్ఞప్తికి తెచ్చుకొందాం అంటూ ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన ఊరికి రావడం తన ప్రత్యేక అధికారమని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన వంటి వారు దేశం కోసం సేవ చేసేందుకు మనకు స్ఫూర్తిమూర్తులుగా నిలుస్తున్నారు అని శ్రీ మోదీ చెప్పారు.

దేశం కోసం ప్రాణాలు ఒడ్డే అవకాశం మనకు దక్కి ఉండకపోవచ్చు; అయితే, మనమందరం మన జీవనాన్ని దేశం కోసం వినియోగించాలని ప్రధాన మంత్రి సూచించారు. ఏ దేశమైనా దాని ప్రజల శక్తితో, వారి ఆకాంక్షలు మరియు కఠిన పరిశ్రమ ద్వారా ముందుకు సాగుతుంది అని ఆయన స్పష్టంచేశారు.

ప్రతి ఒక్క భారతీయుడు కశ్మీర్ ను ప్రేమిస్తాడు, కశ్మీర్ ను సందర్శించాలని కోరుకుంటాడు అని ప్రధాన మంత్రి అన్నారు. పెడదోవన వెళ్లిన కొన్ని శక్తులు కశ్మీర్ యొక్క గొప్ప సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్నారు అని ఆయన అన్నారు.

కశ్మీర్ యువతీయువకుల కోసం ఉపాధి అవకాశాలను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. కశ్మీర్ యువత ముందుకు రావాలి, కశ్మీర్ ను ”భూతల స్వర్గం”గా మలచాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ శాంతిని కోరుకొంటోంది- పర్యటక రంగం నుండి మరింత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలని కశ్మీర్ ప్రజ వాంఛిస్తోంది అని ఆయన చెప్పారు.

అన్ని సమస్యలకు అభివృద్ధి ద్వారానే ఒక పరిష్కారాన్ని కనుగొనాలని అటు కేంద్రం, ఇటు జమ్ము – కశ్మీర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి అని ఆయన అన్నారు. ‘ఇన్సానియత్, జమూరియత్, కశ్మీరియత్’ అన్న పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి విజన్ ను ముందుకు తీసుకువెళ్తామని శ్రీ మోదీ తెలిపారు.

దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడం కోసం ఉమ్మడి నిబద్ధతతో మనం అందరం కలసికట్టుగా పనిచేయవలసిన తక్షణావసరం ఉన్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశపు మువ్వన్నెల జెండా మనను ఒక్కటి చేస్తుంది, భారతదేశ భవితవ్యాన్ని తిరగరాయడానికి మనకు ప్రేరణను అందిస్తుంది అని ఆయన చెప్పారు.

ఆ తరువాత దేశ 70వ స్వాతంత్ర్య సంవత్సర ఉత్సవాల ఆరంభాన్ని సూచిస్తూ, ‘తిరంగా యాత్ర’ ను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.