2016 మార్చి నెల 15వ తేదీన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు శ్రీ అష్రఫ్ గనీ టెలిఫోన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక రంగాలే కాకుండా ఇంకా ఇతర అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి తీసుకోదగిన చర్యలను గురించి చర్చించారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలపై తమ తమ అభిప్రాయాలను వారు ఇద్దరూ ఒకరితో మరొకరు వ్యక్తం చేసుకొన్నారు.