Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్ర‌ధాన మంత్రి సంభాషణ

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్ర‌ధాన మంత్రి సంభాషణ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బిపి) అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ప్రధాన మంత్రి ప్రతి అవార్డు గ్రహీతకు స్మారక చిహ్నాలను అందించి, ఆపై వారితో ఫ్రీవీలింగ్ ఇంటరాక్షన్‌- ఇష్టాగోష్ఠిలో నిమగ్నమయ్యారు. అవార్డుకు ఎంపికైనందుకు పిల్లలు తమ విజయాల వివరాలను పంచుకున్నారు. సంగీతం, సంస్కృతి, సౌరశక్తి, బ్యాడ్మింటన్, చెస్ వంటి వివిధ విషయాలపై చర్చించారు.

పిల్లలు కూడా ప్రధానమంత్రిని అనేక ప్రశ్నలు అడిగారు, వాటిలో ఒక దానికి సమాధానమిస్తూ, తనకు అన్ని రకాల సంగీతంపై తనకున్న ఆసక్తిని గురించి, ధ్యానంలో తనకి అవి ఎలా సహాయపడతాయో చెప్పారు. నిన్న ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించడం గురించి అడిగినప్పుడు, ప్రధానమంత్రి తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సౌరశక్తిని వినియోగించుకోవడానికి తీసుకున్న చర్యలను గుర్తుచేసుకున్నారు. ఈ పథకం ద్వారా ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారనే దాని గురించి కూడా మాట్లాడారు. ప్రధాన మంత్రి పిల్లలతో ఈ రోజు ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఇది పరాక్రమ్ దివస్ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని ప్రభుత్వం ఎలా గౌరవిస్తోందో వారికి చెప్పారు.

కళ, సంస్కృతి, శౌర్యం, ఆవిష్కరణ, సైన్స్ & టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం అనే ఏడు విభాగాలలో అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందజేస్తోంది. ప్రతి అవార్డు గ్రహీతకి మెడల్, సర్టిఫికేట్, సైటేషన్ బుక్‌లెట్ ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం, దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 19 మంది పిల్లలు  పీఎంఆర్బిపి  -2024కి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలలో 18 రాష్ట్రాలు/యుటీలకు చెందిన 9 మంది బాలురు, 10 మంది బాలికలు ఉన్నారు.

.

***