Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ముద్ర యోజన లో భాగం గా ‘శిశు రుణాల’ ను సత్వరం చెల్లిస్తే 2 శాతం వడ్డీ సబ్సిడీ ని 12 నెలల పాటు వర్తింపచేసేందుకు ఆమోద ముద్ర


ప్రధాన మంత్రి ముద్ర యోజన (పిఎమ్ఎమ్ వై) లో భాగం గా ఉన్నటువంటి అన్ని శిశు రుణ ఖాతాల లోనూ అర్హులైన రుణస్వీకర్తల కు 12 నెలల కాలం పాటు 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్శన్ ను కల్పించేందుకు ఉద్దేశించినటువంటి ఒక పథకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ దిగువ న ఉదాహరించిన ప్రమాణాల కు తగినట్టు ఉండే రుణాల కు ఈ పథకాన్ని విస్తరించనున్నారు –
2020 వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటి కి బారీ పడ్డవీ; ఇంకా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) దిశానిర్దేశాల ప్రకారం 2020 వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటి కి మరియు పథకం అమలు లో ఉండేటటువంటి కాలం లో వసూలు కానటువంటి రుణం (ఎన్ పిఎ) వర్గం లో చేరనివీ నూ.

ఖాతా లు ఎన్ పిఎ కేటగిరీ లో చేరకుండా ఉన్నన్ని నెలల కు- అలాగే, ఎన్ పిఎ గా మారిన తరువాత ఆ ఖాతా మళ్లీ ఒక వసూలు అయ్యే రుణం గా మారేటంత వరకు- వడ్డీ లో (ప్రభుత్వ) ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పథకం రుణాల ను క్రమం తప్పక తిరిగి చెల్లింపు జరిపేటటువంటి వారి కి ప్రోత్సహకం గా ఉంటుందన్నమాట.

ఈ పథకం తాలూకు అంచనా వ్యయం సుమారు గా 1,542 కోట్ల రూపాయలు గా ఉండగలదు. భారత ప్రభుత్వం ఈ డబ్బుల ను సమకూర్చుతుంది.

పూర్వరంగం

ఈ పథకం ఎమ్ఎస్ఎమ్ఇ లకు సంబంధించి ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో ప్రకటించిన చర్యల లో ఒక చర్య ను అమలుపరచేందుకు ఉద్దేశించింది. పిఎమ్ఎమ్ వై లో భాగం గా, 50,000 రూపాయల వరకు ఆదాయాన్ని అందించే కార్యకలాపాల కు ఇచ్చిన రుణాల ను ‘శిశు రుణాలు’ గా వ్యవహరిస్తున్నారు. పిఎమ్ఎమ్ వై లోన్స్ ను ముద్ర లిమిటెడ్ లో నమోదు అయినటువంటి సభ్యత్వ రుణదాత సంస్థలు, అంటే షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ లు ఇంకా సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థ లు అందజేస్తున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం తో పాటు తత్పర్యవసానం గా విధించిన లాక్ డౌన్ లు శిశు ముద్ర రుణాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందుకొన్నటువంటి సూక్ష్మ మరియు చిన్న వాణిజ్య వ్యవస్థల వ్యాపారానికి తీవ్ర భంగపాటు కలిగేందుకు కారణమయ్యాయి. చిన్న వ్యాపారాలు స్వల్ప నిర్వహణ మార్జిన్ లపై ఆధారపడి పనిచేయడం పరిపాటి. ప్రస్తుత లాక్ డౌన్ ఆ వ్యాపార వ్యవస్థల నగదు ప్రవాహాల పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీనితో రుణాల ను తిరిగి చెల్లించేటటువంటి వారి యొక్క సామర్థ్యం ఇబ్బందిని ఎదుర్కొంది. ఇది తిరిగి చెల్లింపు బాధ్యత నెరవేర్చకుండా ఉండటానికి దారితీయడం తో పాటు దీని తాలూకు ప్రభావం రాబోయే కాలం లో సంస్థాగత పరపతి లభ్యత పైనా ప్రసరించవచ్చును.

2020 వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటి కి పిఎమ్ఎమ్ వై లో భాగం గా ఉన్నటువంటి ‘శిశు’ కేటగిరీ లో దాదాపు గా 9.37 కోట్ల రుణ ఖాతా లు మొత్తం 1.62 లక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించవలసివుంది.

కార్యాచరణ రీతి

ఈ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డివెలప్ మంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడిబిఐ) ద్వారా అమలుపరచనున్నారు. ఈ పథకం 12 మాసాల పాటు అమలు లో ఉంటుంది.

రుణ స్వీకర్త ల కోసం, ఎవరికయితే వారి వారి రుణదాత లు ‘కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజ్’ లో భాగం గా ఆర్ బిఐ అనుమతి ఇచ్చిన ప్రకారం అప్పు నిలుపుదల కు అవకాశాన్ని కల్పించారో, వారి కి సదరు అప్పు నిలుపుదల గడువు సమాప్తి అయిన తరువాత ఈ పథకం ఆరంభం అయ్యి 12 నెలల పాటు వర్తిస్తుంది; అంటే ఈ పథకం 2020 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 2021 వ సంవత్సరం ఆగస్టు 31 వ తేదీ వరకు అమలవుతుందన్న మాట. ఇతర రుణ స్వీకర్తల కోసం ఈ పథకం 2020 వ సంవత్సరం జూన్ ఒకటో తేదీ న ఆరంభమై 2021 వ సంవత్సరం మే నెల 31వ తేదీ వరకు అమలు లో ఉంటుంది.

ప్రముఖ ప్రభావం

ఈ పథకాన్ని ఇదివరకు ఎరుగనటువంటి ఒక పరిస్థితి కి ప్రతిస్పందన గా ఒక నిర్దిష్ట ప్రతిక్రియ గా రూపొందించడమైంది. ‘పిరమిడ్ అడుగు భాగం లో’ ఉన్నటువంటి రుణస్వీకర్తల కు వారి పరపతి వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఆర్థికపరమైన చిక్కు లో చిక్కుకోకుండా కాపాడాలన్నది దీని ధ్యేయం గా ఉంది. ఈ పథకం ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి ఎంతో అవసరమైనటువంటి ఉపశమనాన్ని అందిస్తుందని ఆశించడమైంది. దీనితో చిన్న వ్యాపారాలు నిధుల కొరత కారణం గా ఉద్యోగుల ను పనిలో నుండి తొలగించకుండా కార్యకలాపాలల ను కొనసాగించే వీలు ఏర్పడుతుంది.

ఈ సంకట కాలం లో చిన్న వ్యాపారాల ను వాటి కార్యకలాపాలు కొనసాగించే విధం గా మద్దతివ్వడం ద్వారా, ఈ పథకం ఆర్థిక వ్యవస్థ పై ఒక సకారాత్మక ప్రభావాన్ని కలుగజేసి, మరి దాని పునరుద్ధరణ కు సమర్థన నుఇవ్వగలదని భావిస్తున్నారు. భవిష్యత్తు లో ఉద్యోగకల్పన జరగాలంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుద్ధరణ ఎంతయినా అవసరం.

**