ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బెల్జియమ్ ప్రధాని శ్రీ చార్ల్ స్ మిచేల్ లు ఇరువురూ కలసి బుధవారం రిమోట్ ఉపకరణం సహాయంతో ఉత్తరాఖండ్ లోని దేవస్థల్ లో 3.6 మీటర్ల ఆప్టికల్ టెలిస్కోప్ ను ప్రారంభించారు.
ఆర్యభట్ట రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జర్వేషనల్ సైన్సె స్ (ఎఆర్ఐఇఎస్) వద్ద రూపొందించిన ఈ టెలిస్కోప్ ను ఉత్తరాఖండ్ హిమాలయాలలో నెలకొల్పారు. బెల్జియమ్, భారతదేశం లకు చెందిన శాస్త్రవేత్తల సన్నిహిత సహకారంతో, మరీ ముఖ్యంగా బెల్జియమ్ కు చెందిన అడ్వాన్స్ డ్ మెకానికల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ (ఎఎమ్ఒఎస్), మరియు భారతదేశంలోని ఎఆర్ఐఇఎస్ కు చెందిన బృందాల ఉమ్మడి కృషి తో.. ఈ టెలిస్కోప్ ను స్థాపించారు.
ఇది ఒక ప్రపంచ శ్రేణి ఆధునిక టెలిస్కోప్. అనేక అగ్రగామి శాస్త్రీయ అప్లికేషన్ లకు ఈ టెలిస్కోప్ తన వంతుగా తోడ్పాటును అందించగలదు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ అధునాతనమైన ఫుల్లీ స్టీరబుల్ ఆప్టికల్ టెలిస్కోప్ ను హిమాలయాల ఒడిలో విజయవంతంగా నెలకొల్పిన ఇరు దేశాల శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ప్రభుత్వానికి మరొక ప్రభుత్వానికి మధ్య జరిగిన ప్రయత్నం కాదని, ఇందులో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఎఆర్ఐఇఎస్ ప్రమేయంతో పాటు, ఒక ప్రయివేట్ కంపెనీ అయిన ఎఎమ్ఒఎస్ కు కూడా ప్రమేయం ఉందన్నారు. ఈ టెలిస్కోప్ ను సాంకేతికంగా పనిచేయించే ప్రక్రియను 6,500 కిలోమీటర్ల దూరాన ఉన్న బ్రసెల్స్ లో నుంచి రిమోట్ ఉపకరణం ద్వారా మొదలుపెట్టడాన్ని బట్టి చూస్తుంటే ఒక సారి ప్రయాసలను సమన్వయపరచడం అంటూ జరిగిందా ఇక ఏదీ అసాధ్యం కాదు అని నిరూపణ చేసినట్లు అయిందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భాన్ని లెక్క లోకి తీసుకొన్నట్లయితే, ఆఖరుకు ఆకాశం కూడా ఒక హద్దు అని చెప్పజాలం! అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
***
PM Michel & I activated India's largest optical telescope, an example of what India-Belgium partnership can achieve. https://t.co/j9hciAsp2v
— Narendra Modi (@narendramodi) March 30, 2016