Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్) మార్పులకు మంత్రివర్గం ఆమోదం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  రూ.69,515.71 కోట్ల వ్యయంతో 2021-22 నుంచి 2025-26 వరకూ) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపిందిఈ నిర్ణయం 2025-26 వరకు దేశవ్యాప్తంగా రైతులకు అనివార్య ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి సహాయపడుతుంది.

దీనికితోడు పారదర్శకతక్లెయిమ్ లెక్కింపుసెటిల్ మెంట్ సామర్ధ్యం పెంచేందుకు వీలుగా ఈ పథకం అమలులో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (ఫియట్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద సాంకేతిక కార్యక్రమాలైన యస్టెక్విండ్స్రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ కోసం ఈ నిధులను వినియోగించనున్నారుటెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (ఎస్– టెక్ద్వారా దిగుబడి అంచనాకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుందిఅందులో టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనాలకు కనీసం 30% ప్రాధాన్యత ఇస్తారుతొమ్మిది  ప్రధాన రాష్ట్రాలు – ఏపీఅస్సాంహర్యానాఉత్తర ప్రదేశ్మధ్యప్రదేశ్మహారాష్ట్రఒడిశాతమిళనాడు,  కర్ణాటక దీనిని ప్రస్తుతం అమలు చేస్తుండగాఇతర రాష్ట్రాలను కూడా త్వరితగతిన దీని పరిధిలోకి తెస్తున్నారుఎస్టెక్ ను విస్తృతంగా అమలు చేయడంతోపంట కోత ప్రయోగాలుసంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయి. 2023-24 సంవత్సరానికి ఎస్టెక్ క్లెయిమ్ లెక్కింపు,  సెటిల్మెంట్ పూర్తయిందిమధ్యప్రదేశ్ 100% సాంకేతిక ఆధారిత దిగుబడి అంచనాను అమలు చేసింది

వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్), పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందివిండ్స్ కిందహైపర్ లోకల్ వాతావరణ డేటాను అభివృద్ధి చేయడానికి ప్రస్తుత నెట్‌వర్క్ సాంద్రతను రెట్లు పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం కిందడేటా అద్దె ఖర్చులను మాత్రమే కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయితొమ్మిది ప్రధాన రాష్ట్రాలలో  కేరళఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరిఅస్సాంఒడిశాకర్ణాటకఉత్తరాఖండ్ రాజస్థాన్లలో విండ్స్ ను అమలుచేసే ప్రక్రియ పురోగతిలో ఉందిఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

టెండరింగ్ కు ముందు అవసరమైన వివిధ నేపథ్య సన్నాహకప్రణాళిక పనుల కారణంగా 2023-24 (ఇఎఫ్ సి ప్రకారం మొదటి సంవత్సరంలో రాష్ట్రాలు విండ్స్ ను అమలు చేయలేకపోయాయిదీని ప్రకారం 90:10 నిష్పత్తిలో అధిక కేంద్ర నిధుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24తో గాక 2024-25ను మొదటి సంవత్సరంగా కేంద్ర మంత్రివర్గం  ఆమోదించింది.

ఈశాన్య రాష్ట్రాల రైతులందరినీ ప్రాధాన్య క్రమంలో ప్రోత్సహించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయిఈ మేరకు ప్రీమియం సబ్సిడీలో 90 శాతం ఈశాన్య రాష్ట్రాలతో కేంద్రం పంచుకుంటుందిఅయితే ఈ పథకం స్వచ్చందం కావడంఈశాన్య రాష్ట్రాలు తక్కువ పంటలు పండే ప్రాంతం కావడంతో నిధులను వెనక్కు తీసుకోకుండా నిధుల అవసరం ఉన్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులుపథకాల్లో  వాడేందుకు (రీలోకేషన్వెసులుబాటు కల్పించారు.

 

***