Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రైతులకో ప్రోత్సాహకం: ప్రధాని


ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన దేశ వ్యాప్త రైతులకో ప్రోత్సాహకమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన తన మనోభావాలను ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఆయన సందేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. :

“రైతు సోదర-సోదరీమణులారా. మీరందరూ లోహ్ డీ, సంక్రాంతి, బిహు వంటి వేరు వేరు పండుగలను జరుపుకొంటున్న తరుణంలో, ప్రభుత్వం తరఫు నుంచి మీకు అందుతున్న ఒక కానుక.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన.”

“ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన.. ఇంతవరకు ఎన్ని పథకాలైతే వచ్చాయో వాటన్నింటిలోని ప్రత్యేకతలను తనలో కలుపుకొని వచ్చినటువంటి పథకమిది. అంతే కాదు, పాత పథకాలలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఇందులో భర్తీ చేయడం జరిగింది.”

“ఇంతదాకా ఎప్ఫుడూ లేనంత తక్కువ ప్రీమియం రేటు; నష్టాన్ని త్వరితంగా లెక్కగట్టడానికి మొబైల్ ఫోన్ వంటి సరళమైన సాంకేతికతను ఉపయోగించడం; పూర్తి క్లెయిమును నిర్దిష్ట కాలావధి లోపల చెల్లించడం ఈ కొత్త పథకంలోని కొన్ని విశేషాంశాలు.”

“కిసాన్ సోదర-సోదరీమణులారా. మరెన్నో పార్శ్వాల పట్ల కూడా ఈ పథకం రూపకల్పనలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం ఎంతో సులువు; దీనితో లబ్ధిని పొందడం సుగమమైనది కూడా. ఈ పథకంలో మీరుతప్పక చేరండి.”

“నేడొక చరిత్రాత్మకమైన రోజు. రైతుల మేలు కోరి తెచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయదారుల జీవనంలో పెను మార్పు తీసుకు రాగలదన్న నమ్మకం నాకుంది.”

“ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఆపదల పరిధిని విస్తరించారు. పంట పొలాలు వరద జలాలలో మునిగిపోవడం, పంట కోతల తరువాత వాటిల్లే నష్టాలు వంటి ఆపదలను సైతం ఈ పథకం పరిధిలోకి చేర్చడం జరిగింది.”

***