Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి థాయ్‌లాండ్ పర్యటనలో ముఖ్యాంశాలు


1. భారత్థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన.

2. డిజిటల్ సాంకేతికతల రంగంలో సహకారంపై ఆదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థసమాజ (సొసైటీమంత్రిత్వ శాఖ.. భారతదేశ ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం.

3. గుజరాత్‌లో లోథాల్ వద్ద నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీఅభివృద్ధి కోసం భారతదేశ ఓడరేవులురవాణాజలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన సాగర్‌మాల విభాగంథాయ్‌లాండ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైన్‌ఆర్ట్స్ విభాగం మధ్య అవగాహన ఒప్పందం.

4. సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల విషయంలో సహకారంపై భారత జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ఎన్‌ఎస్‌ఐసీ), థాయ్‌లాండ్‌కు చెందిన చిన్నమధ్య తరహా సంస్థల ప్రోత్సాహక కార్యాలయం (ఓఎస్‌ఎంఈపీ– ఆఫీస్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ప్రమోషన్మధ్య అవగాహన ఒప్పందం.

5. భారత ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండీఓఆర్), ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం.

6. భారత్‌కు చెందిన ఈశాన్య హస్తకళలుచేనేత అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఈహెచ్‌హెచ్‌డీసీ– నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌ల్యూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), థాయ్‌లాండ్ ప్రభుత్వ క్రియేటివ్ ఎకానమీ ఏజెన్సీ (సీఈఏమధ్య అవగాహన ఒప్పందం.