ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సి ఐ ఎస్ సి ఒ (సిస్కో) చైర్మన్ శ్రీ జాన్ చాంబర్స్ ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా భారతదేశంలో సిస్కో చేపట్టదలుస్తున్న డిజిటైజేషన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ తీరుతెన్నులను గురించి, ఈ కార్యక్రమం ప్రధాన మంత్రి దార్శనికతతోను, ఇంకా డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్మార్ట్ సిటీస్ మరియు సైబర్ సెక్యూరిటీ ల వంటి కార్యక్రమాలతోను ఏ విధంగా తుల తూగుతున్నదీ ప్రధాన మంత్రికి శ్రీ చాంబర్స్ వివరించారు.
సిస్కో తలపెట్టిన ఈ చొరవను ప్రధాన మంత్రి అభినందించారు. దూర ప్రాంత విద్య వంటి కొన్ని రంగాలలో ఈ చొరవ తాలూకు ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. సబ్సిడీలు దారి మళ్లకుండా డిజిటల్ సాంకేతిక విజ్ఞాన వినియోగం తోడ్పడిందని ఆయన అన్నారు. అంతే కాకుండా, సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారానికి ఉన్న అవకాశాలను గురించి కూడా ఆయన చర్చించారు.
***
John Chambers of CISCO & I spoke about some of CISCO's initiatives & aspects relating to technology & Digital India. https://t.co/EdBqwqVcuY
— Narendra Modi (@narendramodi) 18 March 2016