Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన సింగపూర్ సీనియర్ మంత్రి మరియు కోఆర్డినేటింగ్ మినిస్టర్ ఫర్ సోశల్ పాలిసీస్ శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సింగపూర్ సీనియర్ మంత్రి మరియు కోఆర్డినేటింగ్ మినిస్టర్ ఫర్ సోశల్ పాలిసీస్ శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం ఈ రోజు న సమావేశమయ్యారు.

శ్రీ శణ్ముగరత్నం ను ప్రధాన మంత్రి భారతదేశాని కి ఆహ్వానిస్తూ, నూతన సంవత్సరం సందర్భం లో ఆత్మీయ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. శ్రీ శణ్ముగరత్నం ద్వారా సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ కు కూడాను శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ద్వైపాక్షిక సంబంధాలు శర వేగాన్ని అందుకోవడం పట్ల ప్రధాన మంత్రి తో పాటు శ్రీ శణ్ముగరత్నం సంతృప్తి ని వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాలు, ఇండియా-సింగపూర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేశన్ అగ్రిమెంట్ (సిఇసిఎ), డిజిటల్ ఎకానమీ లు సహా ఆర్థిక సహకారం రంగం లో పరస్పర హితం ముడిపడ్డ అనేక అంశాల ను గురించి వారు చర్చించారు. భారతదేశం లో సామాజిక పరివర్తన ను తీసుకొని రావడం లో, డిజిటల్ ఎకానమీ ని ప్రోత్సహించడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని శ్రీ శణ్ముగరత్నం ప్రశంసించారు.

మౌలిక సదుపాయాల కల్పన, పర్యటన, డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్, నూతన ఆవిష్కరణలు మరియు పరిపాలన రంగాలలో భారతదేశానికి మరియు సింగపూర్ కు మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిలాష ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

**