Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా గవర్నర్- జనరల్

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా గవర్నర్- జనరల్


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గవర్నర్ జనరల్ శ్రీ డేవిడ్ హర్లే తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ హౌస్ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.

గవర్నర్ జనరల్ 2019 వ సంవత్సరం లో న్యూ సౌథ్ వేల్స్ కు గవర్నర్ హోదా లో ఉంటూ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆయన తో జరిగిన సమావేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.

దీర్ఘకాలం గా కొనసాగుతూ వస్తున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచే ఉపాయాల ను గురించి ఇద్దరు నేత లు చర్చించారు.

ఆస్ట్రేలియా మరియు భారతదేశం ల మధ్య సన్నిహిత సంబంధాల ను వృద్ధి చెందింప చేయడం లో అక్కడి భారతీయ సముదాయం యొక్క సకారాత్మకమైనటువంటి తోడ్పాటు ను మరియు వారి యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

 

***