భారతదేశం–సింగపూర్ మంత్రుల స్థాయి సంయుక్త ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి తో ఈ రోజు న సమావేశమైంది. ఈ ప్రతినిధి వర్గం లో సింగపూర్ ఉప ప్రధాని మరియు సింగపూర్ ఆర్థిక మంత్రి శ్రీ లారెన్స్ వాంగ్, సింగపూర్ వ్యాపారం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ గాన్ కిమ్ యోంగ్ లతో పాటు భారతదేశం ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ గారు లు కూడా ఉన్నారు. మంత్రులు 2022 సెప్టెంబర్ 17వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లో జరిగిన భారతదేశం–సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎమ్ఆర్) ప్రారంభ సమావేశం యొక్క ఫలితాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు. ఉప ప్రధాని హోదా లో శ్రీ లారెన్స్ వాంగ్ భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటి సారి.
ఐఎస్ఎమ్ఆర్ ను ఏర్పాటు చేయడం ఒక పథనిర్దేశక కార్యక్రమం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల కు అనుగుణం గా దీనిని స్థాపించడమైంది. ఇది భారతదేశం–సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాల విశిష్ట స్వభావాని కి అద్దం పడుతున్నది. సమావేశం సాగిన క్రమం లో మంత్రులు ప్రధాన మంత్రి కి డిజిటల్ కనెక్టివిటి, ఫిన్ టెక్, గ్రీన్ ఇకానమి, నైపుణ్యాల అభివృద్ధి మరియు ఆహార భద్రత ల వంటి వృద్ధిచెందుతున్న రంగాల కు సంబంధించి విస్తృత స్థాయి లో జరిగిన చర్చల ను గురించి తెలియజేశారు.
ప్రధాన మంత్రి వారిని ప్రశంసిస్తూ, ఐఎస్ఎమ్ఆర్ వంటి కార్యక్రమాలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల ను మరింతగా బలపరచడం లో సహాయపడగలవన్న ఆశ ను వెలిబుచ్చారు. ప్రధాని శ్రీ లీ కి మరియు సింగపూర్ ప్రజల కు తన శుభాకాంక్షల ను కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
***
Had a fruitful meeting with DPM & Finance Minister of Singapore @LawrenceWongST, Minister of Trade & Industry Gan Kim Yong. Discussed ways to further boost bilateral ties between our countries, especially in emerging areas like digital connectivity, green hydrogen and Fintech. pic.twitter.com/ZiCoBHKhF1
— Narendra Modi (@narendramodi) September 19, 2022