Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో యు.ఎస్. విదేశాంగ మంత్రి శ్రీ జాన్ కెరీ, యు.ఎస్. వాణిజ్య మంత్రి శ్రీ పెనీ ప్రిత్ జర్ ల భేటీ

ప్రధాన మంత్రి తో యు.ఎస్. విదేశాంగ మంత్రి శ్రీ జాన్ కెరీ, యు.ఎస్. వాణిజ్య మంత్రి శ్రీ పెనీ ప్రిత్ జర్ ల భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని యు.ఎస్. విదేశాంగ మంత్రి శ్రీ జాన్ కెరీ మరియు యు.ఎస్. వాణిజ్య మంత్రి శ్రీ పెనీ ప్రిత్ జర్ లు ఈ రోజు కలుసుకొన్నారు.

వారు నిన్న న్యూ ఢిల్లీ లో ముగిసిన రెండవ ఇండియా-యుఎస్ స్ట్రాటజిక్ అండ్ కమర్షియల్ డైలాగ్ గురించిన వివరాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్రధాన మంత్రి 2016 జూన్ లో యు.ఎస్. ను సందర్శించిన నాటి నుండి ద్వైపాక్షిక సంబంధాలలో చోటు చేసుకొన్న పురోగతిని గురించి చర్చించారు. ఈ ప్రాంతంలోను, ఇతరత్రాను జరిగిన పరిణామాల పట్ల యు.ఎస్. దృష్టికోణాన్ని కూడా శ్రీ కెరీ ఈ సందర్భంగా వెల్లడించారు.

గత రెండు సంవత్సరాలుగా భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సమన్వయానికి నూతన మార్గాలను తెరవడంతో పాటు ఇరు దేశాల భాగస్వామ్యం విస్తృత‌మూ, బలోపేతమూ కావడం పట్ల ప్రధాన మంత్రి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. జూన్ లో అధ్యక్షుడు శ్రీ ఒబామా తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు విజయవంతంగాను, శర వేగంగాను ఆచరణలోకి రావడం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.

చైనా లోని హాంగ్ జోవూ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు శ్రీ ఒబామా ను కలుసుకోవడం కోసం వేచి ఉన్నట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు.