ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ లంక విదేశాంగ మంత్రి శ్రీ రవి కరుణనాయకే ఈ రోజు కలుసుకొన్నారు.
గత నెలలో ఇంటర్ నేషనల్ వేసాక్ డే సందర్భంగా శ్రీ లంక లో తాను జరిపిన పర్యటన ఫలప్రదంగా, స్మరణీయమైందిగా మిగిలిన సంగతిని ప్రధాన మంత్రి గుర్తుకుతెచ్చుకొన్నారు.
శ్రీ లంక లో ఇటీవల వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడంపై ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో శ్రీ లంక కు సహాయం కొనసాగించడానికి భారతదేశం సంసిద్ధంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
వరదలు రావడం, కొండ చరియలు విరిగిపడిన ఘటనల నేపథ్యంలో భారతదేశం సత్వర సహాయాన్ని అందించినందుకుగాను ప్రధాన మంత్రి కి శ్రీ లంక విదేశాంగ మంత్రి శ్రీ రవి కరుణనాయకే ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంతో సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు శ్రీ లంక ప్రభుత్వం నిబద్ధమై ఉంటుందని ఆయన అన్నారు.
***
Mr. Ravi Karunanayake, the Foreign Minister of Sri Lanka met PM @narendramodi. pic.twitter.com/MVu3KB7Qsq
— PMO India (@PMOIndia) June 6, 2017