Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో ఫ్రాన్స్ రక్షణ మంత్రి భేటీ

ప్రధాన మంత్రి తో ఫ్రాన్స్ రక్షణ మంత్రి భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఫ్రాన్స్ రక్షణ మంత్రి శ్రీ జాన్ యూవే ల ద్రాన్ నేడు సమావేశమయ్యారు.

జమ్ము- కశ్మీర్ లోని ఉరీ లో 2016 సెప్టెంబరు 18 న సీమాంతర ఉగ్రవాదుల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల మంత్రి శ్రీ ల ద్రాన్ సంతాపం వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించే కార్యకలాపాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణబద్ధులమవుదామని ప్రధాన మంత్రి తో ఆయన అన్నారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో భారతదేశానికి ఫ్రాన్స్ అండగా నిలబడుతుందని ఆయన చెప్పారు.

ద్వైపాక్షిక రక్షణ రంగ సహకారం తాలూకు వర్తమాన స్థాయిపై ప్రధాన మంత్రికి మంత్రి శ్రీ ల ద్రాన్ సంక్షిప్తంగా వివరించారు.

ఇదే రోజున 36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా, సకాలంలో అమలులోకి రావాలని ప్రధాన మంత్రి కోరారు.