Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా

ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా

ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా

ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా


ప్రకటనలు

  • జపాన్ 2018 అక్టోబర్ 29వ తేదీ నాడు సమర్ధన పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లో చేరినట్లు ప్రకటించింది.  ప్రస్తుతానికి 70 దేశాలు ఐఎస్ఎ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంటు (ఐఎస్ఎ ఎఫ్ఎ) పై సంతకాలు చేయగా మరో 47 దేశాలు దీనికి సమర్ధన ను తెలిపాయి.  జపాన్ దీనిపై సంతకాలు చేసిన 71వ దేశం, ఐఎస్ఎ ఎఫ్ఎ కు సమర్ధన తెలిపిన 48వ దేశం కానుంది.
  • యెన్ రూప రుణ పథకాలు ఏడింటి సర్ధుబాటు కు సంబంధించిన పత్రాల ఆదాన ప్రదానం జరిగింది.  ఈ పథకాల లో ముంబయి-అహమదాబాద్ హైస్పీడ్ రైల్ నిర్మాణ పథకం, ఉమియం-ఉంత్రూ హైడ్రో ఇలెక్ట్రిక్ పవర్ స్టేషన్ మూడో దశ పునర్నవీకరణ మరియు ఆధునికీకరణ పథకం, ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ప్రాజెక్టు (మూడో దశ) ఈశాన్య రహదారి నెట్ వర్క్ సంధానం మెరుగుదల పథకం, తుర్గా పంప్ డ్ స్టేజ్  నిర్మాణ పథకం, చెన్నై పెరిఫరల్ రింగ్ రోడ్డు నిర్మాణ పథకం, ఇంకా త్రిపుర లో స‌స్‌టైన‌బుల్ క్యాచ్‌మెంట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌ పథకం ఉన్నాయి.  (మొత్తం రుణ సర్దుబాటు 316.458 బిలియన్ యెన్ మేరకు ఉంటుంది.)

 

ఎ.  రక్షణ ఇంకా వ్యూహాత్మక రంగాలు

1.

భారతీయ నౌకా దళానికి, జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కు మధ్య ప్రగాఢ సహకారం కోసం ఉద్దేశించిన వ్యవస్థ ను అమలులోకి తీసుకు రావడం.

భారతీయ నౌకా దళానికి, జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కు మధ్య మరింత సహకారం తో పాటు సముద్ర సంబంధ అవగాహన తాలూకు సమాచారం యొక్క ఆదాన ప్రదానానికి.

బి.  డిజిటల్, ఇంకా నవీన సాంకేతిక పరిజ్ఞానాలు

2.

జపాన్ – ఇండియా డిజిటల్ పార్ట్‌న‌ర్‌శిప్‌ అంశం పై ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ కు చెందిన ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం & పరిశ్రమ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరియు ఐఒటి (ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్) తదితర రంగాల లో భారతదేశానికి చెందిన ‘‘డిజిటల్ ఇండియా’’, ‘‘స్మార్ట్ సిటీ’’, ఇంకా ‘‘స్టార్ట్-అప్ ఇండియా’’ లకు, జపాన్ కు చెందిన ‘‘సొసైటీ 5.0’’ కు మధ్య కలయికల మరియు పరస్పర పూరకాల అండదండలను తీసుకోవడానికి

3.

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రంగం లో నీతి ఆయోగ్ కు మరియు జపాన్ కు చెందిన ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, ఇంకా పరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎమ్ఇటిఐ) కు మధ్య  స్టేట్ మెంట్ ఆఫ్ ఇన్‌టెన్ట్

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ సంబంధి సాంకేతికతల లో సహకారాన్ని ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి పరచడానికి

సి.  హెల్త్ కేర్,  ఇంకా వెల్ నెస్

4.

ఆరోగ్య సంరక్షణ, ఇంకా వెల్ నెస్ రంగం లో భారత ప్రభుత్వ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్ష‌ేమ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియెట్ లోని ఆరోగ్య సంరక్షణ విధాన కార్యాలయం తో పాటు ఆరోగ్యం, కార్మిక, ఇంకా సంక్ష‌ేమ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, అసాంక్రామిక వ్యాధుల నివారణ, ప్రసూతి సంబంధిత సేవలు, ఇంకా శిశు ఆరోగ్య సేవలు, పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ, పోషణ విలువ లతో పాటు, వృద్ధుల సంరక్షణ రంగాల లో భారతదేశానికి, జపాన్ కు మధ్య సమన్వయం కోసం అవకాశాలు ఉన్న రంగాల లో గుర్తించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం.

5.

ఆరోగ్య సంరక్షణ, ఇంకా వెల్ నెస్ రంగం లో భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కు, జపాన్ ప్రభుత్వ కనాగవా పాలక ప్రాంతానికి మధ్య ఎంఒసి

ఆరోగ్య సంరక్షణ, ఇంకా వెల్ నెస్ రంగం లో భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కు, జపాన్ ప్రభుత్వ కనాగవా పాలక ప్రాంతానికి మధ్య ఎంఒసి

6.

ఆహార భద్రత రంగం లో ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్‌ స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) కు మరియు ఫూడ్ సేఫ్టీ కమిశన్ ఆఫ్ జపాన్ కు చెందిన వినియోగదారు వ్యవహారాల సంస్థ కు, జపాన్ ప్రభుత్వ ఆరోగ్యం, కార్మిక, ఇంకా సంక్ష‌ేమ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు

ఆహార భద్రత రంగం లో భారతదేశానికి మరియు జపాన్ కు చెందిన ఏజెన్సీ ల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి

డి.  వ్యవసాయం మరియు ఫూడ్ వాల్యూ చైన్ రంగాలు

7.

ఫూడ్ ప్రాసెసింగ్ & పరిశ్రమ రంగం లో ఆహార మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ కు చెందిన వ్యవసాయం, అడవులు, ఇంకా మత్స్య మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు తదితర సంబంధిత వర్గాల ప్రమేయం తో భారతదేశ ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ను అభివృద్ధి పరచడమే దీని ధ్యేయం

8.

వ్యవసాయం, ఇంకా మత్స్య పరిశ్రమ రంగం లో భారతదేశం లో జపాన్ పెట్టుబడిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయం, ఇంకా రైతుల సంక్ష‌ేమం మంత్రిత్వ శాఖ కు మరియు  జపాన్ ప్రభుత్వ వ్యవసాయం, అడవులు, ఇంకా మత్స్య మంత్రిత్వ శాఖ కు మధ్య ఒక కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవగాహన కార్యక్రమం

చేపలు/రొయ్యల పెంపకం తో సహా మత్స్య పరిశ్రమ, ఇంకా అగ్రికల్చరల్ వేల్యూ చైన్ ల అభివృద్ధి ని ప్రోత్సహించడం కోసం జపాన్ కు చెందిన కంపెనీల కు పెట్టుబడి కి అనువైన వాతావరణాన్ని మెరుగుపరచడానికి

9.

మహారాష్ట్ర లో ఫూడ్ వేల్యూ చైన్ ను అభివృద్ధి చేయడం అనే అంశం పై మహారాష్ట్ర ప్రభుత్వాని కి మరియు జపాన్ ప్రభుత్వ వ్యవసాయం, అడవులు, ఇంకా మత్స్య మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

మహారాష్ట్ర లో ఫూడ్ వేల్యూ చైన్ లో జపాన్ కు చెందిన కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేయడానికి

10.

ఉత్తర్ ప్రదేశ్ లో ఫూడ్ వాల్యూ చైన్ ను అభివృద్ధి చేయడం కోసం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాని కి మరియు జపాన్ ప్రభుత్వ వ్యవసాయం, అడవులు, ఇంకా మత్స్య మంత్రిత్వ శాఖ కు మధ్య సహకార పూర్వక ఒప్పంద పత్రం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో ఫూడ్ వాల్యూ చైన్ రంగం లో జపాన్ కు చెందిన కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేయడానికి

ఇ.  ఆర్థిక రంగం లో

11.

ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా కు, జపాన్ లోని ఎన్ఇఎక్స్ఐ కి మధ్య ఎంఒయు

తృతీయ‌ పక్ష‌ దేశాల కు చెందిన పథకాల కు సంబంధించి సహకారాన్ని పటిష్ట పరచుకోవడం తో పాటు భారతదేశానికి, జపాన్ కు మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడిని ప్రోత్సహించడానికి

ఎఫ్.  తపాలా రంగం లో

12.

తపాలా రంగం లో భారత ప్రభుత్వ కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు, జపాన్ ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాలు మరియు కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ మరియు ఆంతరంగిక వ్యవహారాలు మరియు కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మధ్య తపాలా సేవల పై చర్చ ను ప్రారంభించడం ద్వారాను, ఇంకా ఇతర మార్గాల లోను తపాలా రంగ సంబంధిత సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి

జి.  ఎస్&టి, విద్యా రంగ సంబంధిత ఆదాన ప్రదానం మరియు పర్యవారణం రంగాల లో

13.

పరిశోధన రంగం లో భాగస్వామ్యం కోసం భారతదేశం లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు జపాన్ కు చెందిన హిరోశిమా విశ్వవిద్యాలయానికి మధ్య ఎంఒయు

ఎలక్ట్రానిక్స్, సెన్సర్స్, హై స్పీడ్ విజన్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ సహా అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్, పర్యావరణ సంబంధిత పరిశోధన, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేశన్ తదితర రంగాల లో పరిశోధన కు ఉద్దేశించిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి

14.

పరిశోధన సంబంధిత భాగస్వామ్యం కోసం భారతదేశం లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు జపాన్ కు చెందిన రిసర్చ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆర్ సిఎఎస్ టి), ఇంకా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కు మధ్య ఎంఒయు

నవీకరణ యోగ్య శక్తి, రోబోటిక్స్/ఐఒటి అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల లో పరిశోధన సంబంధిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి

15.

పారిశ్రామిక పరిశోధన లలో వినియోగించేందుకు ఇంటర్ డిసిప్లినరీ ఏరియాల లో సంయుక్త పరిశోధనకై భారతదేశం లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు జపాన్ కు చెందిన టోక్యో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (టిఐటి)లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇనవేటివ్ రిసర్స్ కు మధ్య సహకార పూర్వక ఒప్పందం.

అడ్వన్స్ డ్ మెటీరియల్స్, బయో సైన్స్ మరియు ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీస్ రంగాల లో భారతదేశం లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు జపాన్ కు చెందిన టోక్యో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (టిఐటి)లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇనవేటివ్ రిసర్స్ కు మధ్య పరిశోధన సంబంధిత భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి

16.

తపాలా రంగం లో భారత ప్రభుత్వ కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాలు, ఇంకా కమ్యూనికేశన్ ల మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి

కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ మరియు ఆంతరంగిక వ్యవహారాలు మరియు కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ కు మధ్య తపాలా సేవల పై చర్చను ప్రారంభించడం ద్వారా, ఇంకా ఇతర మార్గాల లో తపాలా రంగ సంబంధిత సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి

17.

పర్యావరణ సంబంధిత సహకారం రంగం లో భారతదేశానికి, జపాన్ కు మధ్య ఎంఒసి

పర్యావరణాన్ని పరిరక్ష‌ించడం మరియు మెరుగుపరచడం కోసం భారతదేశానికి, జపాన్ కు మధ్య మరింత సహకారాన్ని ప్రోత్సహించడానికి

18.

విద్య పరమైన మరియు పరిశోధన పరమైన ఆదాన ప్రదానాలకై భారతదేశం లోని నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఎడ్యుకేశన్ అండ్ రిసర్చ్ (ఎన్ఐపిఇఆర్) కు మరియు జపాన్ లోని  శిజువోకా విశ్వవిద్యాలయానికి మధ్య ఎంఒయు

నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఎడ్యుకేశన్ అండ్ రిసర్చ్, ఎస్.ఎ.ఎస్ నగర్ కు మరియు శిజువోకా విశ్వవిద్యాలయానికి మధ్య విద్యా పరమైన బంధాలను ప్రోత్సహించడానికి

19.

ఇండో-జపాన్ గ్లోబల్ స్టార్ట్ – అప్ దిశ గా మరింత సహకారం అనే అంశం పై భారతదేశం లోని కాంచీపురం లో గల ఐఐటిడిఎమ్ కు మరియు నాగసాకీ విశ్వ విద్యాలయానికి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.

ఇండో – జపాన్ గ్లోబల్ స్టార్ట్-అప్ తో పాటే  సమాచార సాంకేతికత మరియు మానవ వనరుల వికాసానికి

20.

విద్య పరమైన ఆదాన ప్రదానం కోసం భారతదేశం లోని హైదరాబాద్ లో గల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి మరియు జపాన్ లోని హీరోశిమా విశ్వవిద్యాలయాని కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

ఈ రెండు సంస్థల మధ్య విద్యార్థుల మరియు సదుపాయాల ఆదాన ప్రదానానికి, అలాగే సంయుక్త పరిశోధన లను ప్రోత్సహించడానికి

21.

హైదరాబాద్ లో గల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి మరియు నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

ఈ రెండు సంస్థల మధ్య విద్యార్థుల మరియు సదుపాయాల ఆదాన ప్రదానానికి, అలాగే సంయుక్త పరిశోధన లను ప్రోత్సహించడానికి.

22.

విద్యా పరమైన ఆదాన ప్రదానాల కై కాన్ పుర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి మరియు హొకైడో విశ్వవిద్యాలయం లోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇన్ ఫర్మేశన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రాడ్యుయేట్ స్కూల్ అండ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఫేకల్టీ లకు మధ్య ఒప్పందం

 

కాన్ పుర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి మరియు హొకైడో విశ్వవిద్యాలయం లోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇన్ ఫర్మేశన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రాడ్యుయేట్ స్కూల్ అండ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లకు మధ్య విద్య పరమైన ఆదాన ప్రదానాల కై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)

ఈ రెండు సంస్థల మధ్య విద్యార్థుల మరియు సదుపాయాల ఆదాన ప్రదానానికి, అలాగే సంయుక్త పరిశోధన లను ప్రోత్సహించడానికి

హెచ్.  క్రీడల రంగం లో

       

23.

క్రీడల సంబంధిత సహకారం మరియు విద్యా రంగం లో ఆదాన ప్రదానాల కై భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ) కి మరియు జపాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబా కు మధ్య ఎంఒయు

సంయుక్త కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా క్రీడల అభివృద్ధి మరియు శ్రేష్టత్వం రంగం లో సహకారాన్ని బలోపేతం చేయడానికి

ఐ.   ఈ కింది అంశాల లో రుణ ఒప్పందాల పత్రాల యొక్క ఆదాన ప్రదానం:

24.

ముంబయి-అహమదాబాద్ హైస్పీడ్ రైల్ (II) నిర్మాణ పథకం  

     

25.

ఉమియం- ఉంత్రూ  మూడో దశ హైడ్రో ఇలెక్ట్రిక్ పవర్ స్టేషన్ పునర్ నవీకరణ మరియు ఆధునికీకరణ పథకం

 

26.

ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ప్రాజెక్టు (ఫేజ్ 3) (III)

 

27.

ఈశాన్య రహదారి నెట్ వర్క్ సంధానం మెరుగుదల పథకం (ఫేజ్ 3) (I)

 

28.

త్రిపుర లో స‌స్‌టైన‌బుల్ క్యాచ్‌మెంట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌ పథకం

 

జి2బి/బి2బి ఒప్పందాలు

29.

 జపాన్ లోని కగోమ్ కో. లిమిటెడ్ కు మరియు భారత ప్రభుత్వ ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం

 

30.

భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్ బిఐ) కి, ఎస్ బిఐ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మరియు హితాచి పేమెంట్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్

 

31.

భారతదేశం లోని ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ లోని నిస్సాన్ స్టీల్ ఇండస్ట్రీ కో. లిమిటెడ్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం

 

32.

భారతదేశం లో పెట్టుబడి పెట్టేందుకు 57 జాపనీస్ కంపెనీల ద్వారా లెటర్స్ ఆఫ్ ఇన్ టెన్ట్ మరియు ప్రైవేటు రంగ పెట్టుబడి పథకం ప్రతిపాదనల తాలూకు అంగీకారం;  జపాన్ లో పెట్టుబడి పెట్టేందుకు 15 భారతీయ కంపెనీల అంగీకారం.  వీటికి భారతదేశం మరియు జపాన్ ప్రభుత్వాలు రెండింటి మద్దతు ఉంటుంది.

 

వరుస సంఖ్య ఎంఒయు /ఒప్పందం/ఒడంబడిక యొక్క పేరు వివరణ

 

**