Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి కి మరియు నేపాల్ ప్రధాని కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేపాల్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ కె.పి. శర్మ ఓలి నేడు టెలిఫోన్ లో మాట్లాడారు.

భారతదేశం యొక్క 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో భారతదేశం ప్రజల కు మరియు ప్రభుత్వానికి నేపాల్ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఐక్య రాజ్య సమితి యొక్క భద్రత మండలి లో శాశ్వతేతర సభ్యత్వ దేశం గా భారతదేశం ఇటీవల ఎన్నికైనందుకు గాను ఆయన అభినందన లు అందజేశారు.

ఇరు దేశాల లో ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్-19’ తాలూకు ప్రభావాన్ని తగ్గించడం కోసం పాటుపడుతున్న నేపథ్యం లో నేతలు ఉభయులు పరస్పరం సంఘీభావాన్ని వ్యక్తం చేసుకొన్నారు. ఈ విషయం లో నేపాల్ కు భారతదేశం సాయపడటాన్ని కొనసాగించగలదని ప్రధాన మంత్రి తెలిపారు.

నేపాల్ ప్రధాని టెలిఫోన్ ద్వారా మాట్లాడినందుకు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ యొక్క మరియు భారతదేశం యొక్క నాగరకత పరమైనటువంటి సంబంధాల ను, ఇంకా సంస్కృతి పరమైనటువంటి సంబంధాల ను ప్రధాన మంత్రి గుర్తు తెచ్చుకొన్నారు.