ప్రధాన మంత్రి కార్యాలయం లో ప్రస్తుతం ఒఎస్‌డి విధుల ను నిర్వహిస్తున్న శ్రీ పి.కె. సిన్హా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రిన్సిపల్ అడ్ వైజర్ గా నియమించడమైంది.
శ్రీ సిన్హా 2015వ సంవత్సరం జూన్ 13వ తేదీ నుండి 2019 వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ వరకు కేబినెట్ సెక్రటరీ గా సేవలు అందించారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ కాడర్ కు చెందిన 1977వ సంవత్సరం బ్యాచ్ ఐఎఎస్ అధికారి. శ్రీ సిన్హా తన ప్రముఖ వృత్తి జీవనం లో విద్యుత్తు మరియు శిప్పింగ్ మంత్రిత్వ శాఖ లో కార్యదర్శి గా పని చేశారు. పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ లో స్పెశల్ సెక్రటరీ గా కూడా సేవల ను అందించారు.
ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి అర్థ శాస్త్రం లో పట్టభద్రుడు అయ్యారు. ఆ తరువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అర్థ శాస్త్రం లో స్నాతకోత్తర విద్య ను అభ్యసించారు. తదనంతరం, సర్వీసు లో ఉంటూనే పబ్లిక్ అడ్మినిస్ట్రేశన్ లో మాస్టర్స్ డిప్లొమా ను మరియు సోషల్ సైన్సెస్ లో ఎం.ఫిల్.ను పొందారు.
ఐఎఎస్ లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రమం లో, శ్రీ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోను, కేంద్ర ప్రభుత్వం లోను వేరు వేరు పదవుల ను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో శ్రీ సిన్హా నిర్వహించిన వివిధ పదవీ బాధ్యతల లో జౌన్ పుర్ మరియు ఆగ్రా యొక్క జిల్లా మేజిస్ట్రేట్, వారాణసీ కమిశనర్, సెక్రటరీ (ప్లానింగ్)మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేశన్) తదితర పదవులు ఉన్నాయి. ఆయన కేంద్ర ప్రభుత్వం లో అనేక సంవత్సరాల పాటు సేవ లు అందించారు. వాటి లో ప్రధానం గా శక్తి, ఇంకా మౌలిక సదుపాయాల రంగాలు- అంటే పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విద్యుత్తు శాఖ, ఇంకా శిప్పింగ్ శాఖ ల వంటివి- ఉన్నాయి. శక్తి, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఆర్థిక శాస్త్ర రంగాల లో ఆయన ది అందెవేసిన చేయి.
*******