Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ను బలియా లో ప్రారంభించిన ప్రధాన మంత్రి; 5 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ లను మూడేళ్లలో సమకూర్చనున్నారు

‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ను బలియా లో ప్రారంభించిన ప్రధాన మంత్రి; 5 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ లను మూడేళ్లలో సమకూర్చనున్నారు

‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ను బలియా లో ప్రారంభించిన ప్రధాన మంత్రి; 5 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ లను మూడేళ్లలో సమకూర్చనున్నారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బలియా లో ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ను ప్రారంభించారు. ఈ పథకం పేదరిక రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది లబ్ధిదారులకు రానున్న మూడు సంవత్సరాలలో వంట గ్యాసును ఉచితంగా సమకూర్చే ధ్యేయంతో ప్రవేశపెట్టబడింది.

మే ఒకటో తేదీని శ్రామిక దినోత్సవంగా జరుపుకొంటున్నామని ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, ఈ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామికులు అందరి ధ్యేయం ప్రపంచాన్ని ఒక్కటి చేయడమే కావాలి అని అన్నారు.

పేదల సంక్షేమం పైన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలలోనూ శ్రామికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

శ్రమ్ సువిధ పోర్టల్ ను, శ్రామికులకు లేబర్ ఐడెంటిటీ నంబరులను ఇవ్వడాన్ని గురించి కూడా ఆయన జ్ఞాపకం చేశారు.

విప్లవకారుడు మంగళ్ పాండే పుట్టిన గడ్డ బలియా అని ప్రధాన మంత్రి అంటూ, దశాబ్దాల తరబడి తూర్పు ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు అనుసంధానాన్ని పటిష్టం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అపారంగా నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలకు విద్యుత్తు సదుపాయాన్ని కల్పించడంలో శీఘ్ర ప్రగతి నమోదైనట్లు తెలిపారు. మనం పేదరికంపైన చేస్తున్న పోరాటం బలపడాలి అంటే, పురోగతి ఫలాలు దేశంలోని తూర్పు ప్రాంతానికి అంది తీరాలి అని ఆయన చెప్పారు.

పథకాల రూపకల్పన అనేది వోటర్ల ప్రయోజనాలను పొందడం కోసం మాత్రమే కాకుండా, పేదల సంక్షేమాన్ని మనస్సులో పెట్టుకొని జరగాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ బీదలకు, మరీ ముఖ్యంగా మహిళలకు మేలు చేసేదే అని ఆయన అన్నారు.