Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో సమావేశమైన ఐఆర్ఎస్ ఆఫీసర్ ట్రెయినీలు

ప్రధాన మంత్రితో సమావేశమైన ఐఆర్ఎస్ ఆఫీసర్ ట్రెయినీలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇండియన్ రెవిన్యూ సర్వీసుకు చెందిన 168 మంది ఆఫీసర్ ట్రెయినీలు (వీరిలో భూటాన్ రాయల్ సర్వీస్ కు చెందిన ఇద్దరు కూడా ఉన్నారు) ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రితో వారు పలు విషయాలను గురించి తమ ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతిక విజ్ఞ‌ానం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటట్లుగా కృషి చేయవలసిందంటూ ఆఫీసర్ ట్రెయినీలకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

***