Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో మయన్మార్ డిఫెన్స్ సర్వీసెస్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ సమావేశం


ప్రధాన మంత్రితో మయన్మార్ డిఫెన్స్ సర్వీసెస్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ ఈ రోజు సమావేశమయ్యారు.

అమరనాథ్ యాత్రకు వెళుతున్న వారిపై ఉగ్రవాదులు ఇటీవల జరిపిన దాడిని సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ ఖండించారు. దాడి యొక్క బాధితుల పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

2017 జూన్ 7వ తేదీన సంభవించిన వైమానిక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మయన్నార్ సాయుధ బలగాల సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి తన సంతాపం తెలిపారు.

సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ ద్వైపాక్షిక రక్షణ, భద్రత సంబంధ సహకారం గురించి ప్రధాన మంత్రికి సంక్షిప్తంగా వివరించారు. భారతదేశానికి, మయన్మార్ కు మధ్య సన్నిహిత సహకారం ఏర్పడటాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

భారతదేశం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్” విధానంలో మయన్మార్ ఒక కీలక స్తంభంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని రంగాలలోను ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకొనేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు.