ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కార్ నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్ నేషనల్ పీస్ ప్రతినిధిబృందం ఈ రోజు కలుసుకొన్నది. ఈ ప్రతినిధిబృందానికి కార్ నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్ నేషనల్ పీస్ అధ్యక్షుడు శ్రీ విలియమ్ బర్న్ స్ నాయకత్వం వహించారు.
భారతదేశంలో ఒక కేంద్రాన్ని ప్రారంభించాలని కార్ నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్ నేషనల్ పీస్ తీసుకొన్న చొరవను ప్రధాన మంత్రి స్వాగతించారు. ఇది ఈ దేశంలోని ప్రజాస్వామిక సంప్రదాయాలు, ఉదారవాద ఆలోచనల ధోరణిని ప్రతిబింబిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారతదేశంలో లిబరల్ ఆర్ట్ స్ లో.. మరీ ముఖ్యంగా ఈ దేశ యువతీయువకులలో.. పరిశోధనల వాతావరణాన్ని ఈ కేంద్రం మరింతగా పెంపొందించగలదని ప్రధాన మంత్రి ఆశించారు; అంతే కాక, భారతదేశానికి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మధ్య, ఇంకా భారతదేశానికి, ప్రపంచంలోని ఇతర దేశాలకు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా పటిష్టపరచగలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Mr. William Burns, President @CarnegieEndow called on PM @narendramodi. pic.twitter.com/xBHZ20xgMo
— PMO India (@PMOIndia) April 5, 2016