Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో నేపాల్ ఉప ప్రధాని మరియు గృహ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బిమలేంద్ర నిధి భేటీ

ప్రధాన మంత్రితో నేపాల్ ఉప ప్రధాని మరియు గృహ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బిమలేంద్ర నిధి భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేపాల్ ఉప ప్రధాని మరియు గృహ వ్యవహారాల శాఖ మంత్రి అయిన శ్రీ బిమలేంద్ర నిధి ఈ రోజు భేటీ అయ్యారు.

నేపాల్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ప్రధాన మంత్రికి శ్రీ బిమలేంద్ర నిధి తెలియజేశారు.

రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాన్ని, దీర్ఘకాలిక మిత్రత్వాన్ని పటిష్ఠపరచడానికి, నేపాల్ సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కోసం నేపాల్ ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతు ఇవ్వడానికి భారతదేశం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి అన్నారు.