Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో టెలిఫోన్ లో మాట్లాడిన నేపాల్ ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.

ఇరువురు ప్రధానులు భారతదేశం- నేపాల్ సంబంధాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై- నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి ఇటీవలే భారతదేశంలో జరిపిన ఆధికారిక పర్యటన చాలా విజయవంతంగా ముగిసిన అంశం సహా- చర్చించారు.

ప్రధాని శ్రీ ప్రచండ రాజ్యాంగ అమలు ప్రక్రియలో సంబంధిత వర్గాలవారందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేందుకు తన ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రయత్నాల గురించి ఈ సందర్భంగా వివరించారు. సుమారు 20 సంవత్సరాల అవధి అనంతరం మొట్టమొదటి సారిగా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రధాని శ్రీ ప్రచండ ప్రస్తావించి, ఈ సందర్భంగా సహాయం చేయవలసిందంటూ భారతదేశాన్ని అభ్యర్థించారు.

శాంతి, సుస్థిరత మరియు సామాజిక, ఆర్థిక పరివర్తనలను సాధించడం కోసం నేపాల్ కు చెందిన స్నేహశీలురైన ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశ ప్రజలు మరియు ప్రభుత్వం పక్షాన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాభినందనలను తెలియజేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో భారతదేశం శాయశక్తులా సహాయాన్ని అందిస్తుందని ప్రధాని శ్రీ ప్రంచడకు శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

బహుళ పార్శ్వాలను కలిగి ఉన్న భారతదేశం- నేపాల్ సహకార పూర్వక సంబంధాలను రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం మరింత ముందుకు తీసుకు వెళ్ళాలంటూ ఉభయ ప్రధాన మంత్రులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.