Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీల భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇండియన్ ఫారిన్ సర్వీస్ 2016 బ్యాచ్ కు చెందిన 41 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ఆలోచనలను వారితో పంచుకొంటూ, ఫారిన్ సర్వీస్ అధికారులు చాలా విస్తృత‌మైన‌ సమాచారాన్ని కలిగివుండవలసిన అవసరం ఉందని, ప్రపంచ దృష్టి కోణంలో వారు ఆలోచనలు చేస్తుండాలని నొక్కిచెప్పారు.

ఆఫీసర్ ట్రైనీలు వారి వృత్తి జీవన ప్రస్థానంలో ఇతర సర్వీసులకు చెందిన బ్యాచ్ మేట్స్ తో సంబంధం కలిగివుండాలని, అలా చేసినట్లయితే మాతృదేశంలో చోటు చేసుకొంటూ ఉన్న పరిణామాలపైన వారు అవగాహనను ఏర్పరచుకోగలుగుతారని ఆయన సూచించారు. భారతదేశం ఉజ్జ్వలమైన భవిష్యత్తును కలిగివుందని ప్రపంచంలోని చాలా వరకు దేశాలు విశ్వసిస్తున్నాయని, భారతదేశం ఉన్నతితో అవి సౌఖ్యంగా ఉన్నాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

***