అఫ్గానిస్తాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.
డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లాకు ప్రధాన మంత్రి సాదర స్వాగతం పలికారు. జైపూర్ లో జరగనున్న కౌంటర్ టెర్రరిజం-2016 సమావేశంలో డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా ప్రధానోపన్యాసం ఇవ్వను న్నారు.
2015 డిసెంబరులో అఫ్గానిస్తాన్ లో ప్రధాన మంత్రి మొట్టమొదటి సారిగా జరిపిన పర్యటన విజయవంతం అయినట్లు డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పర్యటన ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుత్తేజితం చేసిందని ఆయన అన్నారు. అఫ్గానిస్తాన్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, మానవ సామర్ధ్యాల పెంపుదలలో భారతదేశం అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.
భారతీయులను కాపాడటంలో, మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి 4-5 తేదీలలో మజార్-ఎ-షరీఫ్ లోని భారత వాణిజ్య దూత కార్యాలయంపై దాడి జరిగినపుడు ప్రభుత్వం, ద నేషనల్ సెక్యూరిటీ ఫోర్ సెస్ ప్రదర్శించిన సాహసానికి, చేసిన త్యాగాలకు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతమైన, స్థిరమైన, సంపన్నమైన, సమ్మిళితమైన ప్రజాస్వామిక దేశాన్ని నిర్మించుకొనే దిశగా అఫ్గాన్ ప్రజలు చేస్తున్న కృషికి భారతదేశం పక్షాన చేతనైన అన్ని విధాలుగానూ సహాయ సహకారాలను అందజేస్తామన్న వాగ్దానాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ద్వైపాక్షికంగానూ, ప్రాంతీయ స్థాయిలోనూ మరింతగా విస్తరించుకొనే అంశంపై ఇరువురు నేతలూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఉభయ దేశాల డిప్లొమాటిక్ పాస్ పోర్టు హోల్డర్లు వీసా లేకుండానే ప్రయాణాలు చేయడానికి సంబంధించిన ఒక ఒప్పంద పత్రాన్ని ఇరువురు నేతల సమక్షంలో రెండు పక్షాల ప్రతినిధులు పరస్పరం ఇచ్చి పుచ్చుకొన్నారు.
CEO @afgexecutive & I had a fruitful meeting on how to deepen the strategic partnership between India & Afghanistan. https://t.co/iT1BIQMFaO
— Narendra Modi (@narendramodi) February 1, 2016
India's support to efforts of Afghan people in building a peaceful, stable, prosperous, inclusive & democratic Afghanistan is unwavering.
— NarendraModi(@narendramodi) February 1, 2016