Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రికి ఫోన్ చేసి ఉరీ ఉగ్రవాద దాడి పై సంతాపం తెలిపిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ అశరఫ్ గనీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ అశరఫ్ గనీ ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు. జమ్మూ – కశ్మీర్ లోని ఉరీలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన పట్ల శ్రీ గనీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సీమాంతర ఉగ్రవాద దాడిని అధ్యక్షుడు శ్రీ గనీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం బెదిరింపును తరిమికొట్టేందుకు తీసుకొనే అన్ని చర్యలలోను భారతదేశానికి అఫ్గానిస్థాన్ అండగా నిలబడుతుందని, ఆయా చర్యలపై భారతదేశాన్ని బలపరుస్తుందని ఈ సందర్భంగా అధ్యక్షుడు తెలిపారు.

అమరవీరులైన జవాన్ ల కుటుంబాలకు అధ్యక్షుడు శ్రీ గనీ తన సానుభూతిని తెలియజేశారు.

ప్రధాన మంత్రి అఫ్గానిస్థాన్ అందించిన మద్దతుకు గాను అధ్యక్షుడు శ్రీ గనీకి ధన్యవాదాలు తెలియజేశారు.