Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా) పథకాల కొనసాగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా– ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధా మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్– పిఎంషాపథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
15
వ ఆర్థిక సంఘం చివరి నాటికి (2025-26 ఆర్థిక సంవత్సరంపథకం మొత్తం అంచనా వ్యయం రూ.35,000 కోట్లు కానుంది.
రైతులకువినియోగదారులకు సమర్థవంతమైన సేవలందించడానికి ప్రభుత్వం ధరల ఆదరణ/మద్దతు పథకాన్ని (పిఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్పథకాలను పీఎం శాలో కలిపిందిపీఎంషా సంయుక్త పథకం అమలు ద్వారా సేవలు మరింత చేరువైసానుకూల ప్రభావాన్ని చూపనున్నాయిఇది రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను అందించడంలో సహాయపడటమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువుల లభ్యమయ్యేలా చూస్తుందిపీఎంషా పథకంలో ప్రస్తుతం ధరల ఆదరణ/మద్దతు పథకం (పిఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్), ధర లోటు చెల్లింపు పథకం (పిఒపిఎస్), మార్కెట్ మధ్యవర్తిత్వ పథకం(ఎంఐఎస్మిళితమై ఉంటాయి.

ధరల మద్దతు పథకం కింద పేర్కొన్న పప్పుధాన్యాలునూనె గింజలుకొబ్బరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. ఇది 2024-25 పంటకాలంలో జాతీయ ఉత్పత్తిలో 25 శాతంగా ఉండనుందిరైతులకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకుసంక్షోభ కాలంలో వారి నష్టాల నివారించేందుకు కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలుకు చేసేందుకు రాష్ట్రాలకు వీలు కల్పిస్తుందిఅయితేకందిపప్పుపెసరమైసూర్ పప్పు విషయంలో 2024-25 పంట కాలంలో ఈ పరిమితి వర్తించదు. ఎందుకంటే ముందుగా నిర్ణయించిన విధంగా 2024-25 పంటకాలంలో కందిపప్పుపెసరమైసూర్ పప్పు వంద శాతం సేకరణ ఉండనుంది.

రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలునూనెగింజలుకొబ్బరి కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గ్యారంటీని రూ.45 వేల కోట్లకు పెంచారువ్యవసాయరైతు సంక్షేమ శాఖకనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలునూనెగింజలుకొబ్బరి మరింత కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందికనీస మద్దతు ధర కన్నా మార్కెట్ రేటు పడిపోయినప్పడు కొనుగోలు… వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా నాఫెడ్ కు చెందిన ఇసమృద్ధి పోర్టల్‌లో నమోదిత రైతులు,  నేషనల్ కోపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇసంయుక్తి పోర్టల్ ఎంఎస్‌పీ ధరకే కొనుగోలు చేపడతాయిదీని ద్వారా దేశంలో రైతులు ఈ పంటలను ఎక్కువగా పండించడానికి ప్రోత్సహం లభిస్తుందిఅంతే కాకుండా ఈ పంటలలో స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదపడుతుందిదేశ అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడకుండా చేస్తుంది.
 

ధరల స్థిరీకరణ నిధి (పిఎస్ఎఫ్పథకాన్ని పొడిగించడం ద్వారా ఉల్లిపప్పుధాన్యాలను కీలక సమయంలో వ్యూహాత్మకంగా మార్కెట్టుకు విడుదల చేయడం ద్వారా– వ్యవసాయఉద్యాన ఉత్పత్తుల ధరలు పెరిగినపుడు వినియోగదారులను రక్షించడంలో సహాయపడుతుందిఅదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల అనైతిక నిల్వధరల ఊహాత్మక పెరుగుదలకు ఇది తెరదించుతుంది. వినియోగదారులకు సరసమైన ధరలకు సరఫరా చేయడానికి తోడ్పడుతుందిమార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర ఉన్నప్పుడల్లా నాఫెడ్ ఇసమృద్ధి పోర్టల్ఎన్సిసిఎఫ్ సంయుక్తి పోర్టల్లో ముందస్తుగా నమోదైన రైతులతో సహా వినియోగదారుల వ్యవహారాల శాఖ (డిఓసిఎమార్కెట్ ధర వద్ద పప్పుధాన్యాల సేకరణ చేపడుతుందిధరల స్థిరీకరణ నిధి పథకం టమోటా వంటి ఇతర పంటలతో పాటుభారత్ దాల్భారత్ అట్టాభారత్ రైస్ వంటి సబ్సిడీ రిటైల్ అమ్మకాల్లో పీఎస్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

నోటిఫై చేసిన నూనె గింజల విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ధరల లోటు చెల్లింపు పథకాన్ని (పిడిపిఎస్అమలు చేయనున్నారురాష్ట్ర ఉత్పత్తిలో నూనె గింజలపై ప్రస్తుతం ఉన్న 25 శాతం కవరేజీని 40 శాతానికి పెంచారురైతుల ప్రయోజనాల కోసం అమలు వ్యవధిని నెలల నుండి నెలలకు పెంచారుకేంద్ర ప్రభుత్వం భరించాల్సిన కనీస మద్దతు ధరసేల్/మోడల్ ధరల మధ్య వ్యత్యాస పరిహారం ఎంఎస్పీ లో 15 శాతానికి పరిమితం చేశారు.
పలు మార్పులతో మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్అమలును పొడిగించడం వల్ల త్వరగా పాడయ్యే (పెరిషబుల్ఉద్యాన పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందిప్రభుత్వం ఉత్పత్తిలో కవరేజీని 20 శాతం నుండి 25 శాతానికి పెంచిందిఈ పథకం కింద భౌతిక సేకరణకు బదులుగా నేరుగా రైతుల ఖాతాలో భేదాత్మక చెల్లింపులు చేసే కొత్త వ్యవస్థను తీసుకువచ్చిందిఅంతేకాకుండాటాప్ (టమోటాఉల్లిబంగాళాదుంపపంటల విషయంలోగరిష్ట కోత సమయంలో– ఉత్పత్తి రాష్ట్రాలువినియోగ రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసాన్ని పూడ్చడానికినాఫెడ్ఎన్సిసిఎఫ్ వంటి కేంద్ర సంస్థలు చేపట్టే కార్యకలాపాలకు రవాణానిల్వ ఖర్చులను భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందిఇది రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడమే కాకుండా మార్కెట్లో వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది.