క్ర. సం. |
ఎంవోయూలు/ ఒప్పందాలు/ సవరణలు |
రంగాలు |
1. |
భారత్, ఫ్రాన్స్ కృత్రిమ మేధ డిక్లరేషన్ |
సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత |
2. |
భారత్ – ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం 2026 లోగో ఆవిష్కరణ |
సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత |
3. |
ఇండో-ఫ్రెంచ్ డిజిటల్ సైన్సెస్ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికతా శాఖ, ఫ్రాన్సుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ (ఐఎన్ఆర్ఐఏ) మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలపై సంతకాలు. |
సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత |
4. |
ఫ్రెంచ్ అంకుర సంస్థల ఇంక్యుబేటర్ స్టేషన్-ఎఫ్ ద్వారా 10 భారతీయ అంకుర సంస్థలకు సహకారం. |
సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత |
5. |
అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ |
పౌర అణు ఇంధనం |
6. |
భారత అణు ఇంధన విభాగం (డీఏఈ), ఫ్రాన్సుకు చెందిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అండ్ అటామిక్ ఎనర్జీ కమిషనరేట్ (సీఈఏ) మధ్య అంతర్జాతీయ అణు ఇంధన భాగస్వామ్యం విషయంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం పునరుద్ధరణ |
పౌర అణు ఇంధనం |
7. |
భారత జీసీఎన్ఈపీ, ఫ్రాన్సుకు చెందిన న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ (ఐఎన్ఎస్టీఎన్) మధ్య సహకారానికి సంబంధించి భారత డీఏఈ, ఫ్రాన్సుకు చెందిన సీఈఏ మధ్య ఒప్పందాన్ని అమలు చేయడం |
పౌర అణు ఇంధనం |
8. |
త్రికోణాభివృద్ధిపై సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ. |
ఇండో-పసిఫిక్/ సుస్థిరాభివృద్ధి |
9. |
మార్సిలేలో భారత దౌత్య కార్యాలయానికి ఉభయుల సమక్షంలో ప్రారంభోత్సవం. |
సాంస్కృతిక/ ప్రజా సంబంధాలు |
10. |
పర్యావరణ రంగంలో పర్యావరణ మార్పు, జీవ వైవిధ్యం, అడవులు, సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ- పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ |
పర్యావరణం |