Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా


యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఈ రోజు ఫోన్ చేశారుయూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ కోస్టాకు ప్రధాని అభినందనలు తెలియజేశారుగత దశాబ్దంలో భారత్ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి చర్చిస్తూవాణిజ్యంసాంకేతికతపెట్టుబడులుహరిత విద్యుత్డిజిటల్ స్పేస్‌తో సహా వివిధ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కలసి పనిచేసేందుకు ఇద్దరు నాయకులు అంగీకరించారు.

పరస్పర ప్రయోజనాలు అందించే భారత్ – ఈయూ ఎఫ్‌టీఏను ముందుగానే పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించారుఇరు పక్షాలకు అనుకూలమైన సమయంలో జరిగే భారత్ఈయూ శిఖరాగ్ర సమావేశం కోసం నేతలిద్దరూ ఎదురుచూస్తున్నారు.

పరస్పరం ఆసక్తితో కూడిన ప్రాంతీయఅంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారుతరచూ సంప్రదింపులు కొనసాగించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు.

 

***