Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ ద్వారా కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయం

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ ద్వారా కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయం


   యోధ్యలో సూర్యవంశ తిలకుడైన శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీకి రాగానే లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంపై ప్రతిపాదనపై ఆమోదముద్ర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- క‌రెంటు బిల్లుల త‌గ్గింపుతోపాటు అవసరాల మేరకు విద్యుదుత్పాదన ద్వారా వారికి అసలైన స్వావలంబన కల్పించబడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరాలకు పోగా మిగిలే విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు.

  ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద స్వల్ప-మధ్యాదాయ వర్గాలవారు తమ ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారావారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించడడమే కాకుండా, అవసరాలు తీర్చుకోగా మిగిలిన విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం లభించేలా చూడటం ఈ పథకం లక్ష్యం.

ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పైకప్పు సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా నివాస వినియోగదారుల సమీకరణ కోసం భారీ జాతీయ కార్యక్రమం చేపట్టాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారు.