ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని చైనా ఉపాధ్యక్షుడు శ్రీ లి యువన్ చావో ఈ రోజు కలుసుకున్నారు.
గత సంవత్సరం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చేసిన భారతదేశ పర్యటనను, తాను ఈ సంవత్సరం మే నెలలో చేసిన చైనా సందర్శనను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు.
ఆర్థికంగా, అభివృద్ధిపరంగా ఇరు దేశాల మధ్యనగల భాగస్వామ్యం వృద్ధి కావడానికి వీలుగా భారత్, ఇండియాలు రెండూ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయని ప్రధాని అన్నారు. రైల్వేలు, ఆధునిక నగరాలు (స్మార్ట్ సిటీస్), మౌలిక వసతుల కల్పన, నగరాల్లో రవాణా తదితర రంగాల్లో సహకారానికిగాను ఇరుదేశాల ముందు అనేక అవకాశాలున్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
ఇండియాలో చైనా తన పెట్టుబడుల స్థాయిని పెంచడాన్ని ఈ సందర్భంగా ప్రధాని స్వాగతించారు. భారతదేశాన్ని సందర్శిస్తున్న చైనా యాత్రికుల సంఖ్య పెరుగిందని భవిష్యత్లో ఇది ఇలాగే కొనసాగాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రజల మధ్యన బంధాలు మరింత బలోపేతం కావడానికి ఇండియా, చైనాల మధ్యనగల పురాతన సాంస్కృతిక బంధాలు ఉత్ప్రేరకంగా వుంటాయని ప్రధాని అన్నారు.
ఇరు దేశాల మధ్యన శాంతిపూర్వక, సహకారాత్మక, సుస్థిరమైన బంధాలనేవి చాలా ముఖ్యమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు శ్రీ లి యువాన్ చావో అంగీకరించారు. తద్వారా స్థానికంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, సామరస్యాలను సాధించవచ్చన్నారు.
Discussed India-China cooperation in economy, infrastructure & culture during my meeting with VP, Mr. Li Yuanchao. https://t.co/rQboFTxJiw
— Narendra Modi (@narendramodi) November 6, 2015