Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో శ్రీలంకకు చెందిన భారత సంతతి తమిళ నేతల భేటీ


శ్రీలంక లోని భారత సంతతికి చెందిన తమిళ (ఐఓటీ) నాయకులు ఈ రోజు కొలంబోలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. శ్రీలంక ప్రభుత్వ సహకారంతో ఐఓటీల కోసం 10,000 గృహాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పవిత్ర సీతా ఎలియా ఆలయ ప్రదేశం, ఇతర కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం మద్దతు ఇస్తుందని శ్రీ మోదీ ప్రకటించారు.

 

 

“భారత సంతతికి చెందిన తమిళ (ఐఓటీ) నాయకులతో సమావేశం ఫలప్రదమైంది. ఈ సమాజం 200 సంవత్సరాలకు పైగా రెండు దేశాల మధ్య సజీవ వారధిగా ఉంది. శ్రీలంక ప్రభుత్వ సహకారంతో ఐఓటీల కోసం 10,000 ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పవిత్ర స్థలం సీతా ఎలియా ఆలయం, ఇతర కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం మద్దతు ఇస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.