ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ దౌత్య సలహాదారు శ్రీ ఇమ్మాన్యుయెల్ బాన్ 2023 జనవరి 5న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇండో-పసిఫిక్ సహా రక్షణ, భద్రత వంటి భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల్లో సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జి20కి భారత్ అధ్యక్షతపై ఫ్రాన్స్ మద్దతు పలకడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
మాననీయ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తరఫున స్నేహ సందేశాన్ని శ్రీ బాన్ ప్రధానమంత్రికి తెలియజేశారు. కాగా, అంతకుముందు భారత జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజిత్ దోవల్‌తో తన వ్యూహాత్మక చర్చల గురించి వివరించారు. సాంస్కృతిక సంబంధాలు, ఇంధనం వగైరా పరస్పర ప్రయోజన అంశాలపై తమ మధ్య చర్చలు సాగినట్లు వెల్లడించారు.
అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ- బాలిలో అధ్యక్షుడు మాక్రాన్‌తో ఇటీవల తాను సమావేశం కావడాన్ని ఆదరణపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. భారత పర్యటనకు రావాల్సిందిగా అధ్యక్షుడు మాక్రాన్‌కు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మాక్రాన్ కూడా త్వరలో భారత్ సందర్శనపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారని శ్రీ బాన్ చెప్పారు.
******
Had a fruitful meeting with Mr. Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron covering a wide range of issues from Defence & security to culture. Glad that our Strategic Partnership is further deepening. Conveyed invitation to my friend @EmmanuelMacron to visit India. pic.twitter.com/nJu5uKAueS
— Narendra Modi (@narendramodi) January 5, 2023