కార్యదర్శి ఆస్టిన్, ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ తరఫున ప్రధానమంత్రి మోదీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాస్వామ్యం, బహుత్వ వాదం, నియమాల ఆధారిత క్రమం పట్ల నిబద్ధతతో కూడిన భాగస్వామ్య విలువలతో మమేకమై, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఆహ్లాదకరమైన, సన్నిహిత సంబంధాన్ని ప్రధానమంత్రి, ఈ సందర్భంగా స్వాగతించారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తన దృష్టిని వివరించిన ప్రధానమంత్రి, భారత-అమెరికా సంబంధాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారం నిర్వహిస్తున్న ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పారు. అధ్యక్షుడు బైడెన్ కు తన శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రధానమంత్రి, కార్యదర్శి ఆస్టిన్ ను కోరారు.
కార్యదర్శి ఆస్టిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి అమెరికా ప్రభుత్వ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ, వెలుపల, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న అమెరికా బలమైన కోరికను ఆయన వ్యక్తం చేశారు.
*****
Pleasure to meet U.S. @SecDef Lloyd Austin today. Conveyed my best wishes to @POTUS @JoeBiden. India and US are committed to our strategic partnership that is a force for global good. pic.twitter.com/Z1AoGJlzFX
— Narendra Modi (@narendramodi) March 19, 2021