Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధానమంత్రి గౌరవనీయులు న్యూయెన్ చువాన్ ఫోక్ తో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 డిసెంబర్, 21వ తేదీన వియత్నాం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ న్యూయెన్ చువాన్ ఫోక్ తో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా, ఇరువురు నాయకులు విస్తృత-ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై పరస్పరం తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటారు. భారత-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క భవిష్యత్తు అభివృద్ధికి, వీరు మార్గనిర్దేశనం చేసుకుంటారు.

2020 లో, ఇరు దేశాలు ఉన్నత స్థాయి మార్పిడిని కొనసాగించాయి.  వియత్నాం ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి డాంగ్ థి న్యోక్ థిన్, 2020 ఫిబ్రవరిలో భారతదేశంలో అధికారికంగా పర్యటించారు. కోవిడ్-19 మహమ్మారి నుండి తలెత్తే పరిస్థితిని చర్చించడానికి, 2020 ఏప్రిల్, 13వ తేదీన ఇద్దరు ప్రధానమంత్రులు టెలిఫోను లో మాట్లాడుకున్నారు.  రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సహ అధ్యక్షతన 17వ విడత జాయింట్ కమిషన్ సమావేశం (వర్చువల్)  2020 ఆగస్టు 25 న జరిగింది.  భారత రక్షణ శాఖ మంత్రి 2020 నవంబర్, 27వ తేదీన వియత్నాం రక్షణ మంత్రి తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

 

****