సాంకేతికత– ఆవిష్కరణ
రక్షణ, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాలలో కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల అన్వయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం–ప్రభుత్వం, విద్య – ప్రైవేట్ రంగ సహకారాన్ని పెంపొందించే యుఎస్–ఇండియా ట్రస్ట్ (“ట్రాన్స్ఫార్మింగ్ ది రిలేషన్షిప్ యాజ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ“) ను ప్రారంభిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు.
ట్రస్ట్ కు కేంద్రబిందువుగా ఈ సంవత్సరం చివరి నాటికి కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడంపై యుఎస్–ఇండియా మార్గదర్శక ప్రణాళికను ముందుకు తీసుకురావడానికి రెండు దేశాల ప్రైవేట్ పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్టు నాయకులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిధులు సమకూర్చడం, నిర్మాణం, శక్తిని అందించడం, భారతదేశంలో పెద్ద ఎత్తున యుఎస్ మూలాలు కలిగిన ఏఐ మౌలిక సదుపాయాలను మెరుగైన భవిష్యత్తు చర్యలతో అనుసంధానించడానికి అడ్డంకులను గుర్తిస్తారు. అమెరికా, భారత్ కలిసి తదుపరి తరం డేటా సెంటర్లలో పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులకు మార్గం సుగమం చేయడానికి చర్యలు తీసుకుంటాయి. కృత్రిమ మేధ కోసం కోసం కంప్యూటింగ్ సామర్థ్యం, ప్రాసెసర్ల అభివృద్ధి, వాటిని అందుబాటులోకి తీసుకురావడం, ఎఐ నమూనాలలో నూతన ఆవిష్కరణలు చేయడం, అలాగే సామాజిక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడానికి ఎఐ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో సహకరిస్తాయి. ఈ క్రమంలో ఈ సాంకేతికతల భద్రతకు, నియంత్రణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి కూడా ఉమ్మడిగా పనిచేస్తాయి.
విజయవంతమైన “ఇండస్–ఎక్స్” వేదికను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసిన కొత్త ఇన్నోవేషన్ బ్రిడ్జ్ ‘ఇండస్ ఇన్నోవేషన్‘ ను ప్రారంభిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇది అమెరికా–భారత పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే గాకుండా, అంతరిక్షం, ఇంధనం, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చడానికి, అలాగే ఆవిష్కరణలలో అమెరికా, భారతదేశాల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదం చేయనుంది.
రెండు దేశాల సైన్యాలలో కీలకమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమెరికా, భారత రక్షణ సంస్థలు, పెట్టుబడిదారులు విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని కల్పించే ఇండస్–ఎక్స్ చొరవకు నాయకులు నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే 2025 లో జరగనున్న తదుపరి శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు
ట్రస్ట్ చొరవలో భాగంగా సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలు, ఫార్మాస్యూటికల్స్ కోసం విశ్వసనీయమైన, సుస్థిరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగా, కీలక మందుల తయారీలో అవసరమైన క్రియాశీల ఔషధ పదార్ధాల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియెంట్స్– ఎపిఐ) కోసం అమెరికాతో సహా భారతీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడులు మంచి ఉద్యోగాలను సృష్టిస్తాయి. ముఖ్యమైన సరఫరా వ్యవస్థలను వైవిధ్యపరుస్తాయి. ఇంకా రెండు దేశాలలోనూ ప్రాణాలను రక్షించే మందుల కొరతను తగ్గిస్తాయి.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అధునాతన తయారీ కోసం కీలకమైన ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి, వాటి పరిశోధన, అభివృద్ధిలో సహకారాన్ని వేగవంతం చేయడానికి భారత్, అమెరికా అంగీకరించాయి. అలాగే మినరల్ సెక్యూరిటీ పార్టనర్షిప్ (ఎం ఎస్ పి) లో భాగస్వామ్య దేశాలుగా భారత్, అమెరికా మొత్తం కీలక ఖనిజాలపై పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. కీలకమైన ఖనిజాల అన్వేషణ, ప్రయోజనం, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో సహకారాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇందుకోసం అల్యూమినియం, బొగ్గు గనులు, చమురు, గ్యాస్ వంటి భారీ పరిశ్రమల నుంచి కీలకమైన ఖనిజాలను (లిథియం, కోబాల్ట్, అరుదైన భూ ఖనిజాలు సహా) వెలికితీయడానికి, , ప్రాసెస్ చేయడానికి “స్ట్రాటేజిక్ మినరల్ రికవరీ ఇనిషియేటివ్” అనే కొత్త అమెరికా–భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నేతలు ప్రకటించారు.
ఆక్సియోమ్ ద్వారా నాసా– ఇస్రో సహకారంతో భారతదేశం నుంచి మొదటి ఆస్ట్రోనాట్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువచ్చే ప్రణాళికలు, భూమి ఉపరితల మార్పులను ద్వంద్వ రాడార్ల సాయంతో క్రమబద్ధంగా మ్యాప్ చేసే ఏకైక మిషన్ అయిన సంయుక్త “నిసార్” మిషన్‌ను త్వరితగతిన ప్రారంభించే ప్రణాళికలతో 2025 సంవత్సరాన్ని అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకారంలో మార్గదర్శక సంవత్సరం నేతలు ప్రశంసించారు. దీర్ఘకాలిక మానవ అంతరిక్ష యాత్రలు, అంతరిక్షయాన భద్రత, గ్రహాల రక్షణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నైపుణ్యం, వృత్తిపరమైన మార్పిడితో సహా అంతరిక్ష అన్వేషణలో మరింత సహకారం అవసరమని నాయకులు పిలుపునిచ్చారు. కనెక్టివిటీ, అధునాతన అంతరిక్షయానం, ఉపగ్రహ, అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు, అంతరిక్ష సుస్థిరత, అంతరిక్ష పర్యాటకం, అధునాతన అంతరిక్ష తయారీ వంటి సంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా మరింత వాణిజ్య అంతరిక్ష సహకారానికి నాయకులు నిబద్ధతను ప్రకటించారు.
భారత్, అమెరికా శాస్త పరిశోధనా వర్గాల మధ్య సంబంధాలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తూ, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను పరిశోధించడంలో యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారతీయ అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య కొత్త భాగస్వామ్యాన్ని నేతలు ప్రకటించారు. ఈ భాగస్వామ్యం సెమీ కండక్టర్లు, కనెక్టెడ్ వాహనాలు, మెషీన్ లెర్నింగ్, తదుపరి తరం టెలికమ్యూనికేషన్లు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ( ఐటిఎస్), భవిష్యత్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో సంయుక్త పరిశోధనకు అనుకూలంగా అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారతీయ శాస్త్రీయ సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలపరుస్తుంది.
ఎగుమతుల నియంత్రణలను పరిష్కరించడానికి, ఉన్నత స్థాయి సాంకేతిక వాణిజ్యాన్ని పెంచడానికి, రెండు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో అడ్డంకులను తగ్గించడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయాలని నాయకులు నిర్ణయించారు. కీలకమైన సరఫరా వ్యవస్థల పరిమితికి మించిన కేంద్రీకరణను అవకాశంగా తీసుకోవాలని చూసే తృతీయ పక్షాల ఎగుమతి నియంత్రణలలో అన్యాయమైన పద్ధతులను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని నాయకులు తీర్మానించారు.
బహుళపక్ష సహకారం
స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్న ఇండో–పసిఫిక్ ప్రాంతానికి అమెరికా, భారత్ మధ్య సన్నిహిత భాగస్వామ్యం కీలకమని నేతలు పునరుద్ఘాటించారు. క్వాడ్ భాగస్వాములుగా, ఈ భాగస్వామ్యం ఆసియాన్ కేంద్రీకరణను గుర్తించడంపై ఆధారపడి ఉందని నాయకులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు, సుపరిపాలనకు కట్టుబడి ఉండటం. సముద్ర మార్గాలలో భద్రత, స్వేచ్ఛా నౌకాయానం, విమాన ప్రయాణం సముద్రాల ఇతర చట్టబద్ధమైన ఉపయోగాలకు మద్దతు ఇవ్వడం, అలాగే చట్టబద్ధమైన వాణిజ్యాన్ని నిర్బంధాలు లేకుండా కొనసాగించడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం వంటి అంశాలను పునరుద్ఘాటించారు.
ఢిల్లీలో జరగనున్న క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి ముందు, ప్రకృతి వైపరీత్యాలపై ప్రజల స్పందనకు మద్దతు ఇవ్వడానికి సంయుక్త వైమానిక సామర్థ్యాన్ని పెంచే కొత్త క్వాడ్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పరస్పర పనితీరును మెరుగుపరచడానికి సముద్ర గస్తీని మెరుగుపరుస్తారు.
సహకారాన్ని పెంచాలని, దౌత్య సంప్రదింపులను పెంచాలని, మధ్యప్రాచ్యంలోని భాగస్వాములతో స్పష్టమైన సహకారాన్ని పెంపొందించాలని నాయకులు తీర్మానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను పెంపొందించడానికి కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక కారిడార్లలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రాముఖ్యతను వారు వివరించారు. 2025లో కొత్త కార్యక్రమాలను ప్రకటించేందుకు, వచ్చే ఆరు నెలలలో భారత్– మధ్య ప్రాచ్యం –యూరప్ కారిడార్, ఐ2యూ2 గ్రూప్ భాగస్వాములను సమావేశపరచాలని నాయకులు భావిస్తున్నారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి, మానవతా సహాయం, భద్రతకు భరోసాగా భారతదేశం నిర్వహిస్తున్న పాత్రను అమెరికా ప్రశంసించింది. ఈ సందర్భంలో సువిశాల హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా ద్వైపాక్షిక చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులు తమ నిబద్ధతను ప్రకటించారు. అలాగే, ఆర్థిక అనుసంధానం, వాణిజ్యానికి సమన్వయంతో పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన కొత్త ద్వైపాక్షిక, ప్రభుత్వస్థాయి వేదిక “ఇండియన్ ఓషన్ స్ట్రాటజిక్ వెంచర్”ను ప్రారంభించారు. గ్రేటర్ హిందూ మహాసముద్ర కనెక్టివిటీకి మద్దతు ఇస్తూ, సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టులో బహుళ బిలియన్ల, బహుళ సంవత్సరాల పెట్టుబడిని మెటా ప్రకటించడాన్ని నాయకులు స్వాగతించారు. ఇది ఈ సంవత్సరం పని ప్రారంభిస్తుంది. చివరికి ఐదు ఖండాలను అనుసంధానించడానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ, అంతకు మించి ప్రపంచ డిజిటల్ రహదారులను బలోపేతం చేయడానికి 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. విశ్వసనీయ విక్రేతలను ఉపయోగించి హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మతులు, పెట్టుబడులు పెట్టాలని భారత్ భావిస్తోంది.
రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం కీలకమైన ఖనిజాల మధ్య సంబంధాలు, వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించడానికి పశ్చిమ హిందూ మహాసముద్రం, మధ్యప్రాచ్యం, ఇండో–పసిఫిక్ లో కొత్త బహుళపక్ష భాగస్వామ్యాల ఏర్పాటు అవసరాన్ని నాయకులు గుర్తించారు. 2025 నాటికి ఈ ఉప ప్రాంతాల్లో కొత్త భాగస్వామ్య కార్యక్రమాలను ప్రకటించాలని నేతలు భావిస్తున్నారు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసం బహుళజాతి వేదికల్లో సైనిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేతలు తీర్మానించారు. అరేబియా సముద్రంలో సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ నావికా టాస్క్ ఫోర్స్ లో భవిష్యత్ నాయకత్వ పాత్రను చేపట్టాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు ప్రశంసించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై పోరాడాలని, ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలని నేతలు పునరుద్ఘాటించారు. 26/11 ముంబయి దాడులు, 2021 ఆగస్టు 26న ఆఫ్ఘనిస్తాన్ లోని అబ్బే గేట్ బాంబు దాడి వంటి హేయమైన చర్యలను నివారించడానికి, అల్–ఖైదా, ఐఎస్ఐఎస్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపుల నుండి ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. తమ పౌరులకు హాని కలిగించే వారిని శిక్షించాలనే ఉమ్మడి ఆకాంక్షను గుర్తించిన అమెరికా తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. 26/11 ముంబై, పఠాన్ కోట్ దాడుల సూత్రధారులను త్వరితగతిన శిక్షించాలని, సీమాంతర ఉగ్రదాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని పాకిస్తాన్ కు నేతలు పిలుపునిచ్చారు. మారణాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి, వాటి పంపిణీ వ్యవస్థలను నిరోధించడానికి కలిసి పనిచేస్తామని, ఉగ్రవాదులు, ప్రభుత్వేతర వ్యక్తులు అటువంటి ఆయుధాలను పొందకుండా నిరోధిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
ప్రజల మధ్య సహకారం
ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ప్రస్తావించారు. 3,00,000 మందికి పైగా బలమైన భారతీయ విద్యార్థి సమాజం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్లకు పైగా సమకూరుస్తోందని, అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగుల ప్రతిభ, చలనం రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చాయని వారు గుర్తించారు.ఆవిష్కరణను ప్రోత్సహించడం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, భవిష్యత్ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేయడంలో అంతర్జాతీయ విద్యా సహకారాల ప్రాధాన్యతను గుర్తించిన ఇరువురు నాయకులు ఉన్నత విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలపరచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సంయుక్త/డ్యుయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్లు, సంయుక్త ప్రతిభా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అమెరికా లోని ప్రముఖ విద్యా సంస్థల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను భారత్ లో ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అమలు చేయాలని సంకల్పించారు.
ప్రపంచం ఒక ప్రపంచ పని ప్రదేశంగా పరిణామం చెందడానికి సృజనాత్మక, పరస్పర ప్రయోజనకరమైన,సురక్షితమైన రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ఈ విషయంలో, విద్యార్థులు వృత్తి నిపుణుల చట్టపరమైన రాకపోకలకు స్వల్పకాలిక పర్యాటక, వ్యాపార ప్రయాణాన్ని సులభతరం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇరు దేశాల పరస్పర భద్రత కు హాని కలగకుండా అవాంఛనీయ, , నేర స్వభావం కలిగిన, అక్రమ పద్ధతుల్లో ప్రవేశించిన వ్యక్తుల, వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.
చట్టవిరుద్ధ వలస వ్యవస్థలు, మాదక ద్రవ్యాల ముఠాలు, మానవ, ఆయుధాల అక్రమ రవాణాదారులు, అలాగే ప్రజల భద్రతకు, దౌత్య భద్రతకు, ఇరుదేశాల స్వయంప్రతిపత్తికి, భౌగోళిక సమగ్రతకు ముప్పుగా మారే ఇతర శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాల అమలు సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలపరచాలని నిర్ణయించారు.
ఇరుదేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఉన్నత స్థాయి ఉన్నతస్థాయి పరస్పర సహకారాన్ని కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధానమంత్రి మోదీ సంకల్పం చెప్పుకున్నారు. ప్రకాశవంతమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి, ప్రపంచ శ్రేయస్సుకు, స్వేచ్ఛాయుత, సుస్థిర ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే స్థిరమైన భారత–అమెరికా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
***
Addressing the press meet with @POTUS @realDonaldTrump. https://t.co/u9a3p0nTKf
— Narendra Modi (@narendramodi) February 13, 2025
सबसे पहले मैं, मेरे प्रिय मित्र राष्ट्रपति ट्रम्प को मेरे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए हार्दिक आभार व्यक्त करता हूँ।
— PMO India (@PMOIndia) February 13, 2025
राष्ट्रपति ट्रम्प ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया है: PM @narendramodi
हम मानते हैं कि भारत और अमेरिका का साथ और सहयोग एक बेहतर विश्व को shape कर सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2025
अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब Make India Great Again, यानि “मीगा” है।
— PMO India (@PMOIndia) February 13, 2025
जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं, यानि “मागा” प्लस “मीगा”, तब बन जाता है –“मेगा” पार्ट्नर्शिप for prosperity.
और यही मेगा spirit हमारे लक्ष्यों को नया स्केल और scope देती है: PM
अमेरिका के लोग राष्ट्रपति ट्रम्प के मोटो, Make America Great Again, यानि “मागा” से परिचित हैं।
— PMO India (@PMOIndia) February 13, 2025
भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर हैं: PM @narendramodi
भारत की defence preparedness में अमेरिका की महत्वपूर्ण भूमिका है।
— PMO India (@PMOIndia) February 13, 2025
Strategic और trusted partners के नाते हम joint development, joint production और Transfer of Technology की दिशा में सक्रिय रूप से आगे बढ़ रहे हैं: PM @narendramodi
आज हमने TRUST, यानि Transforming Relationship Utilizing Strategic Technology पर सहमती बनायीं है।
— PMO India (@PMOIndia) February 13, 2025
इसके अंतर्गत critical मिनरल, एडवांस्ड material और फार्मास्यूटिकल की मजबूत सप्लाई chains बनाने पर बल दिया जायेगा: PM @narendramodi
भारत और अमेरिका की साझेदारी लोकतंत्र और लोकतान्त्रिक मूल्यों तथा व्यवस्थाओं को सशक्त बनाती है।
— PMO India (@PMOIndia) February 13, 2025
Indo-Pacific में शांति, स्थिरता और समृद्धि को बढ़ाने के लिए हम मिलकर काम करेंगे।
इसमें Quad की विशेष भूमिका होगी: PM @narendramodi
आतंकवाद के खिलाफ लड़ाई में भारत और अमेरिका दृढ़ता से साथ खड़े रहे हैं।
— PMO India (@PMOIndia) February 13, 2025
हम सहमत हैं कि सीमापार आतंकवाद के उन्मूलन के लिए ठोस कार्रवाई आवश्यक है: PM @narendramodi