Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి మరియు ఒమాన్ సుల్తాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఒమాన్ సుల్తాన్ గౌరవనీయులు హైతం బిన్ తారిఖ్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తలెత్తిన ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సవాళ్ల గురించీ, వాటిని పరిష్కరించడానికి తమ తమ దేశాల్లో చేపట్టిన చర్యల గురించీ, ఇరువురు నాయకులు చర్చించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి పరస్పరం తగిన సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని వారు అంగీకరించారు.

ప్రస్తుత పరిస్థితిలో ఒమాన్ లో ఉన్న భారతీయుల రక్షణ, శ్రేయస్సు గురించి ఆందోళన చెందవద్దని, గౌరవనీయులు సుల్తాన్ భారత ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు. భారతదేశంలో ఉన్న ఒమాన్ పౌరుల విషయంలో భారత ప్రభుత్వం అందించిన మద్దతుకు ఆయన కూడా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గౌరవనీయులు దివంగత సుల్తాన్ ఖబూస్ మృతి పట్ల ప్రధానమంత్రి తన సంతాపాన్ని పునరుద్ఘాటించారు. గౌరవనీయులు సుల్తాన్ హైతం పాలనకు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒమాన్ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తన పొరుగున ఉన్న అతి ముఖ్యమైన దేశంగా ఒమాన్ న్ను భారత దేశం ఎప్పుడూ పరిగణిస్తుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.