డెన్ మార్క్ మహారాణి రెండో మార్గరెట్ గారు కోపెన్ హేగన్ లోని చరిత్రాత్మకమైన అమాలియన్ బోర్ రాజమహలు లో ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి స్వాగతం పలికారు.
డెన్ మార్క్ రాజసింహాసనాన్ని మహారాణి అధిరోహించిన సందర్భం తాలూకు స్వర్ణోత్సవం సందర్భం లో ఆమెకు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
గత కొన్నిసంవత్సరాల లో భారతదేశం-డెన్ మార్క్ ల మధ్య సంబంధాల తో పెరుగుతున్న ప్రగాఢత్వాన్ని గురించి, మరీ ముఖ్యం గా గ్రీన్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ విషయాన్ని గురించి మహారాణి కి ప్రధాన మంత్రి వివరించారు. సామాజిక కార్యాల ను మునుముందుకు తీసుకుపోవడం లో డెన్ మార్క్ యొక్క రాజ పరివారం పోషిస్తున్నటువంటి భూమిక ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి తన కు లభించిన స్నేహపూర్ణ ఆతిథ్యానికి, సత్కారానికి గాను మహారాణి కి ధన్యవాదాల ను తెలియజేశారు.
***
Met Her Majesty, the Queen of the Kingdom of Denmark, Margrethe II in Copenhagen. pic.twitter.com/YZkS1BJbIH
— Narendra Modi (@narendramodi) May 3, 2022