Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి కి ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్’ జాతీయ పురస్కార ప్రదానం

ప్రధానమంత్రి కి ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్’ జాతీయ పురస్కార ప్రదానం


నైజీరియా అధ్యక్షుడు శ్రీ బోలా ఆహమద్ టీనుబూ  ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్’’ జాతీయ పురస్కారాన్ని  స్టేట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రాజనీతి కౌశలానికి, భారత్-నైజీరియా సంబంధాలను పెంచడంలో  ఆయన అందించిన గొప్ప తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసి,  గౌరవించారు. ప్రధాని దూరాలోచన భరిత నాయకత్వ మార్గదర్శకత్వంలో  భారతదేశం ప్రపంచంలో ఓ మహా శక్తిగా రూపొందిందని, అనేక మార్పులను తీసుకు వచ్చిన ఆయన పరిపాలన ఏకతను, శాంతిని, అందరికీ  సమృద్ధిని పెంచిందని పురస్కార సన్మానపత్రంలో పేర్కొన్నారు.

పురస్కారాన్ని ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలతో పాటు భారత్ కు , నైజీరియాకు మధ్య చిరకాలంగా వర్ధిల్లుతూ వస్తున్న చరిత్రాత్మక మైత్రికి అంకితమిచ్చారు. రెండు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని,   వికాస శీల దేశాల ఆకాంక్షల విషయంలో నైజీరియా, భారత్ ల ఉమ్మడి నిబద్ధతను ఈ మాన్యత ప్రధానంగా చాటిచెబుతోందని కూడా ఆయన అన్నారు.

ఈ పురస్కార గౌరవాన్ని 1969 తరువాత తొలిసారి ఓ విదేశీ నేతకు ఇచ్చారు. ఆ నేత ఎవరో కాదు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.