ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ 38వ ‘ప్రగతి’ సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఐసీటీ ఆధారిత బహుముఖ వేదిక ‘‘చురుకైన పాలన-సకాలంలో అమలు’’ (ప్రగతి) సంబంధిత అంశాలపై ఈ సమావేశం చర్చించింది. ఈ సందర్భంగా మొత్తం 8 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. వీటిలో నాలుగు రైల్వే, రెండు విద్యుత్, ఒకటి రోడ్డు-రవాణా జాతీయ రహదారులు, మరొకటి పౌరవిమానయానం శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ఈ ఎనిమిది ప్రాజెక్టుల పనులు ఏడు రాష్ట్రాలు- ఒడిషా, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణాలలో జరుగుతున్నాయి. కాగా, మునుపటి 37వ ‘ప్రగతి’ సమావేశంలో దేశవ్యాప్తంగా సాగుతున్న రూ.14.39 లక్షల కోట్ల విలువైన 297 ప్రాజెక్టులపై సమీక్షించారు.
***
Chaired the 38th PRAGATI meeting today, in which eight important projects relating to the Ministries of Railways, Power, Road Transport & Highways and Civil Aviation were reviewed. These projects span across 7 states and are worth over Rs. 50,000 crore.
— Narendra Modi (@narendramodi) September 29, 2021