Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో చెస్ చాంపియన్ కోనేరు హంపి భేటీ


చదరంగ క్రీడలో విజేత కోనేరు హంపి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారుభారతదేశానికి గొప్ప గర్వకారణంగా నిలిచినందుకు కోనేరు హంపిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూఆమె పదునైన మేధస్సుఅచంచల దృఢనిశ్చయం తేటతెల్లం అయ్యాయన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కోనేరు హంపి నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘కోనేరు హంపినీఆమె కుటుంబాన్నీ కలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందిఆమె క్రీడారంగంలో ప్రతిభావంతురాలుఅంతేకాదువృద్ధిలోకి రావాలని కోరుకుంటున్న క్రీడాకారులకు ఆమె ఓ స్ఫూర్తిఆమె సునిశిత మేధస్సుమొక్కవోని దృఢ సంకల్పం ఈసరికే సుస్పష్టమయ్యాయిభారతదేశానికి గొప్ప గర్వకారణంగా ఆమె నిలవడం ఒక్కటే కాకుండానైపుణ్యం అంటే ఏమిటో కూడా సరికొత్తగా నిర్వచించారు’’

 

***