Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రికి కువైట్ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం

ప్రధానమంత్రికి కువైట్ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్అహమద్ అల్సబాహ్ ‘‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్కబీర్’’ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం కువైట్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం. ఈ కార్యక్రమంలో కువైట్ ప్రధాని శ్రీ షేక్ అహమద్ అల్అబ్దుల్లా అల్అహమద్ అల్సబాహ్ కూడా పాల్గొన్నారు.

ప్రధాని ఈ అవార్డును భారత్, కువైట్‌ల మధ్య చాలాకాలంగా ఉంటున్న మైత్రికి, కువైట్‌లోని భారతీయ సముదాయంతోపాటు 1.4 బిలియన్ (140 కోట్ల) మంది భారతీయులకు అంకితం చేశారు.

భారతదేశ ప్రధానమంత్రి ఒకరు 43 సంవత్సరాల తరువాత కువైట్‌కు ఇలా చరిత్రాత్మక పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఈ సందర్భానికి మరింత విశిష్టతను జోడించింది.

ఈ అవార్డును 1974లో నెలకొల్పారు. అప్పటినుంచి ఎంపిక చేసిన ప్రపంచ నేతలకు ఈ పురస్కారాన్ని ఇస్తూ వస్తున్నారు.

 

***