Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ నైల్‌’ పురస్కార ప్రదానం

ప్రధానమంత్రికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ నైల్‌’ పురస్కార ప్రదానం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ నైల్‌’ అందుకున్నారు. ఈ మేరకు కైరో నగరంలోని అరబ్‌ గణతంత్ర ఈజిప్ట్‌ అధ్యక్ష భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు మాననీయ అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

   తనను ఈ పురస్కారంతో గౌరవించడంపై భారత ప్రజానీకం తరఫున అధ్యక్షుడు సిసికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు కావడం విశేషం.

*****