Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల్లో 33 పతకాలను గెలిచిన భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు


ఇటలీలోని ట్యూరిన్‌లో నిర్వహించిన ‘ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడలు 2025’లో విశిష్ట ప్రదర్శనను కనబరచినందుకు భారతీయ క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ క్రీడాకారుల బృందం 33 పతకాలను గెలిచి ప్రపంచ వేదికపై భారత్‌ గర్వపడేటట్లు చేసింది.

శ్రీ మోదీ ఈ రోజు పార్లమెంటులో క్రీడాకారులతో భేటీ అయ్యి, వారి విజయాలతోపాటు వారు చాటిన అంకితభావాన్ని అభినందించారు.

ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 

‘‘ఇటలీలోని ట్యూరిన్‌లో నిర్వహించిన ‘ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల’లో మన దేశానికి కీర్తిని సంపాదించి పెట్టిన మన క్రీడాకారులను చూస్తే గర్వంగా ఉంది. మన మెరికలు 33 పతకాలు సాధించి స్వదేశానికి తిరిగివచ్చారు.

వారితో పార్లమెంటులో భేటీ అయ్యాను. వారు సాధించిన విజయాలకు వారికి అభినందనలు తెలిపాను.   

@SpecialOlympics” అని పేర్కొన్నారు.

@SpecialOlympics”

****

MJPS/ST