Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రతిష్ఠాత్మక బ్లూ బీచ్ ల జాబితాలో మినికాయ్, తుండి బీచ్, కడమత్ బీచ్లు చేరినందుకు లక్షద్వీప్ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మినియాక్ , తుండిబీచ్, కడమత్ బీచ్లు ప్రతిష్ఠాత్మక బ్లూ బీచ్ ల జాబితాలో చేరినందుకు లక్షద్వీప్ ప్రజలకు అభినందనలు తెలిపారు.

 

ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన బీచ్ లుగా వీటికి పర్యావరణ గుర్తింపు లభించింది.

భారతదేశపు కోస్తాతీర ప్రాముఖ్యతను కొనియాడుతూ ప్రధానమంత్రి , కోస్తా ప్రాంత పరిశుభ్రత పట్ల భారతీయులకు గల మక్కువను ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ట్వీట్ ఒకదానిని షేర్ చేస్తూ ప్రధానమంత్రి, ‘‘ఇది చాల

  గొప్ప విషయం. అభినందనలు. ప్రత్యేకించి ఈ ఘనత సాధించినందుకు లక్షద్వీప్ ప్రజలకు అభినందనలు. భారతదేశపు కోస్తా తీర ప్రాంతం చెప్పుకోదగినది.

కోస్తా తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మన ప్రజలకు మక్కువ ఎక్కువ. ’ అని పేర్కొన్నారు.