Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచడం కోసంభారతదేశం సాంకేతిక విజ్ఞానాని కి ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తోంది: ప్రధాన మంత్రి


ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచడం కోసం భారతదేశం సాంకేతిక విజ్ఞానాని కి ఎనలేని ప్రాముఖ్యాన్ని ఇస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ఆయన ప్రతిస్పందించారు. ఆ ట్వీట్ ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ కు సంబంధించింది. ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ నుండి వాయు మార్గం గుండా వెళ్తే సుమారు గా 40 కిలో మీటర్ ల దూరం (ఒక వైపు) లో ఉన్నటువంటి టిహరీ గఢ్ వాల్ జిల్లా ఆసుపత్రి కి 2 కిలో గ్రాముల టిబి మందుల ను 30 నిమిషాల వ్యవధి లోపల పంపించడం కోసమని డ్రోన్ లను ప్రయోగాత్మకం గా ఉపయోగించడం జరిగింది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంపొందింప చేయడం కోసం భారతదేశం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగ పరచుకోవడాని కి ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోంది’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST