Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐసిటి – ఆధారితమైన మల్టి- మోడల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు జ‌రిగిన 22వ ముఖాముఖి సమావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

మొద‌టి 21 ‘ప్రగతి’ స‌మావేశాల‌లోను మొత్తం రూ. 8.94 ల‌క్ష‌ల కోట్ల విలువైన 190 ప్రాజెక్టుల‌ను గురించి స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 17 రంగాల‌లో ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం పైన కూడా స‌మీక్ష చోటు చేసుకొంది. ఈ రోజు నిర్వ‌హించిన 22వ స‌మావేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఫిర్యాదులను ప‌రిష్క‌రిస్తున్న తీరు లోని పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. జ‌న్ ధ‌న్ ఖాతాదారుల‌కు జారీ చేసిన రూపే డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచే మార్గాలను ప‌రిశీలించాల‌ని ఆర్థిక సేవ‌ల కార్య‌ద‌ర్శికి ప్ర‌ధాన మంత్రి సూచించారు. జ‌న్ ధ‌న్ ఖాతాల‌తో జోడించిన బీమా ప్రొవిజ‌న్ లలో భాగంగా ఆ ఖాతాదారులు అందుకొన్న స‌హాయాన్ని ప్ర‌ధాన మంత్రి దృష్టికి ఈ స‌మావేశంలో తీసుకువ‌చ్చారు.

తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌ణిపుర్‌, మిజోరామ్, కేర‌ళ‌, త‌మిళ‌ నాడు, చ‌త్తీస్‌గ‌ఢ్‌, ఝార్‌ఖండ్ మ‌రియు ఢిల్లీ ల‌తో పాటు అనేక రాష్ట్రాల‌లో రైల్వేలు, రోడ్లు, విద్యుత్‌, బొగ్గు మ‌రియు గ్యాస్ పైపు లైన్ రంగాల‌లో అమ‌లవుతున్న 9 అవ‌స్థాప‌న ప‌థ‌కాల పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. ఇండియా- మ‌య‌న్మార్ మైత్రి సేతువు ప‌నుల‌ను గురించి కూడా స‌మీక్షించారు. ఈ ప్రాజెక్టుల‌న్నింటి ఉమ్మ‌డి విలువ 37,000 కోట్ల రూపాయ‌ల‌కు పైనే ఉంటుంది.

ప్ర‌ధాన మంత్రి నేష‌న‌ల్ హెరిటేజ్ సిటీ డివెల‌ప్‌మెంట్ అండ్ ఆగ్‌మెంటేష‌న్ యోజ‌న (హెచ్ఆర్ఐడిఎవై), ఇంకా దివ్యాంగుల కోసం ఉద్దేశించిన ‘సుగ‌మ్య భార‌త్ అభియాన్’ (Accessible India Campaign) ల‌లో పురోగ‌తిని స‌మీక్షించారు.

అనేక కేంద్ర ప్ర‌భుత్వ విభాగాలు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) ను ఉప‌యోగించుకొంటున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. కాగా, కేవ‌లం 10 రాష్ట్రాలు ఇంత‌వ‌ర‌కు దీనిని వినియోగించుకోవ‌డం ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌ర‌చాయ‌ని ఆయ‌న చెప్పారు. సేక‌ర‌ణ‌లో వేగాన్ని మ‌రియు పార‌ద‌ర్శ‌క‌త్వానికి ఊతాన్ని జిఇఎమ్ అందిస్తుంద‌నీ, అంతేకాకుండా స్థానిక స్థాయిలో వ్యాపారాల‌కు మ‌ద్ధ‌తిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు దీని వినియోగానికి మార్గాల‌ను అన్వేషించాల‌ని, త‌ద్వారా లీకేజీల‌ను మ‌రియు జాప్యాల‌ను క‌నీస స్థాయికి ప‌రిమితం చేయాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ లంద‌రికీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

జిఎస్‌టి గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ నూత‌న ప‌న్ను వ్య‌వ‌స్థ పట్ల దేశ‌వ్యాప్తంగా వ్యాపార‌స్తులు సానుకూలంగా స్పందించి దీనిని ఆమోదిస్తున్నార‌ని, అయితే వారిని వారి చేయి ప‌ట్టుకొని ముందుకు నడిపించవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, అలా చేయ‌డం ద్వారా వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యంలో జిల్లా పాల‌న యంత్రాంగం స‌హాయాన్ని తీసుకోవాల‌ని, అలా తీసుకొన్న‌ప్పుడు చిన్న వ్యాపార‌స్తులు కొత్త వ్య‌వ‌స్థకు అల‌వాటుప‌డ‌డం సులువ‌వుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. వ్యాపార అవ‌కాశాల యొక్క ప్ర‌యోజ‌నాన్ని పొందేందుకు గాను జిఎస్‌టి నెట్‌వ‌ర్క్ లో చిన్న‌వ్యాపార సంస్థ‌లు త‌ప్ప‌క న‌మోదు కావాల‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఒక కొత్త బాట‌ను పరచిన‌టువంటి ఈ నిర్ణ‌యం నుండి స‌గ‌టు పౌరుడు మ‌రియు వ‌ర్త‌కుడు తప్పక లాభం పొందాల‌ని ఆయ‌న సూచించారు.

డిజిట‌ల్ పేమెంట్స్ కు ఉత్తేజాన్ని అందించే మ‌రియు త‌క్కువ న‌గ‌దు చ‌లామ‌ణి అయ్యే స‌మాజం దిశ‌గా ప‌య‌నించేందుకు అదే ప‌నిగా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌ని కూడా ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

***