Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రగతి మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార‌మ్‌ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన 25 వ ముఖాముఖి సంభాషణ సమావేశానికి అధ్యక్షత వ‌హించారు.

25 ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలలో మొత్తం 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబడులతో కూడిన 227 ప్రోజెక్టులపై స‌మీక్ష‌ను నిర్వహించడమైంది. ప‌లు రంగాల‌లో ప్ర‌జా ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రిస్తున్న తీరును కూడా స‌మీక్షించడ‌మైంది.

25 ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలు పూర్తి అయిన సంద‌ర్భంగా సంబంధిత వ‌ర్గాల‌ వారిని ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ‘ప్ర‌గ‌తి’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన ఫ‌లితంగా కేంద్రానికి మ‌రియు రాష్ట్రాల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెరిగిందని ఆయ‌న అన్నారు. ‘ప్ర‌గ‌తి’ కార్య‌క్ర‌మం మ‌న సమాఖ్య వ్యవస్థకు ఒక గొప్ప స‌కారాత్మ‌క‌ శ‌క్తి ని అందించినట్లు ఆయ‌న చెప్పారు. ఈ మాధ్య‌మం పనులు నిల‌చిపోయిన ప్రోజెక్టు ల‌తో పాటు సామాజిక రంగానికి చెందిన అనేక ప‌థ‌కాలను కూడా స‌మీక్షించి, ఆ పథకాలను ఉత్త‌మంగా తీర్చిదిద్ద‌డంలో తోడ్పడినట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఈ రోజు జ‌రిగిన 25వ స‌మావేశంలో, మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించే మ‌రియు ఆ ఫిర్యాదులను ప‌రిష్క‌రించే దిశ‌గా చోటుచేసుకొన్నటువంటి పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌క్రియ‌ లో వేగాన్ని పెంచ‌డానికి ప్రాముఖ్యమివ్వాల‌ని, త‌ద్వారా మాజీ సైనికోద్యోగుల స‌మ‌స్య‌ల‌ను వీలయినంత అతి త‌క్కువ స‌మ‌యంలో స‌కారాత్మ‌కంగా ప‌రిష్క‌రించ‌డం సాధ్య‌ప‌డగలదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రైల్వేలు, ర‌హ‌దారులు, పెట్రోలియ‌మ్‌, విద్యుత్తు, బొగ్గు, ప‌ట్ట‌ణాభివృద్ధి, ఆరోగ్యం, ఇంకా కుటుంబ సంక్షేమ రంగాల‌లో 10 అవ‌స్థాప‌న ప‌థ‌కాల తాలూకు పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. ఈ ప‌థ‌కాలు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఒడిశా, ఆంధ్ర ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర, అసమ్, సిక్కిమ్, ప‌శ్చిమ బెంగాల్‌, బిహార్‌, త‌మిళ నాడు, ఇంకా ఝార్ ఖండ్ ల‌తో స‌హా అనేక రాష్ట్రాల‌లో విస్త‌రించి ఉన్నాయి.

ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న అమ‌లు తీరు లో పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. అలాగే ఆయ‌న షెడ్యూల్డు తెగ‌ల విద్యార్థులు ఉన్న‌త విద్య అభ్య‌సించ‌డం కోసం ఉద్దేశించిన ప్రోగ్రామ్ ఫర్ నేశనల్ ఫెలో శిప్స్ అండ్ స్కాలర్ శిప్ స్ ను కూడా స‌మీక్షించారు.

***