Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రగతి’ ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

‘ప్రగతి’ ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

‘ప్రగతి’ ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రగతి – ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫామ్ ఫర్ ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆరోసారి సంభాషించారు.

తన సమీక్షలో భాగంగా ప్రధాన మంత్రి దేశంలోని 17 రాష్ట్రాల్లో సౌరశక్తి ఆధారిత పార్కుల పనితీరు అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల పనితీరు వేగం పుంజుకునేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాల పాలసీల రూపకల్పనలో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని సూచించారు.

పెటెంట్స్, ట్రేడ్‌మార్క్ ఇచ్చే విషయంలో జరుగుతున్న అనవసర ఆలస్యంపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్ట కాలపరిమితిలో ప్రపంచఃస్థాయి నాణ్యతతో ఈ విషయాలను పూర్తి చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. పేటెంట్స్ దరఖాస్తు నింపే విషయంలో సమగ్రమార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నింపే పద్ధతిలో చాలా మార్పులు చేయాలన్నారు.

దీనితోపాటు రైల్వేలు, మెట్రోరైలు, బొగ్గు, ముడి ఇనుము గనులు, రోడ్లు, విద్యుత్, విమానయాన రంగాలు పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు అవసరమైన కీలక మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రధాన మంత్రి సమీక్షించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి విన్న‌పం మేర‌కు ల‌క్నో మెట్రో రైల్ ప్రాజెక్టు (మొద‌టి ద‌శ‌-ఏ)ను ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. ప్ర‌గ‌తి కింద స‌మీక్ష త‌ర్వాత ప్రాజెక్టుకు చేసిన ప‌లు క్లియ‌రెన్సుల‌పై ప్ర‌ధాని సంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతోపాటు ఒడిషా ప్రభుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు ఖుర్దా-బోలంగిర్ కొత్త బ్రాడ్ గేజ్ రైల్ లింకును కూదా ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు. సిక్కింలోని నూ్య పాక్‌యాంగ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ ప‌నుల‌ను కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మీక్షించారు. మిగ‌తా రాష్ట్రాల‌తో సిక్కింను క‌ల‌ప‌టం, ఆ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు కీల‌క‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణయాలు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు లైన్‌-3 (కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్‌), ఈశాన్య రాష్ట్రాల్లోని ఐర‌న్ ఓర్ మైనింగ్ ప్రాజెక్టుకు పై కూడా ప్ర‌ధాన మంత్రి స‌మీక్ష చేశారు. ఆప్ఘ‌నిస్తాన్ లో భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌ పార్ల‌మెంట్ భ‌వ‌నం, స‌ల్మా డ్యామ్ వంటి ప్రాజెక్టుల‌పై కూడా ప్ర‌ధాని చ‌ర్చించారు. సార్క్ దేశాల్లో భార‌త ప్ర‌భుత్వ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న నిర్మాణాల అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌కు ప్ర‌ధాని ఆదేశించారు.

దేశ‌వ్యాప్తంగా.. జాతీయ ఆహార భ‌ద్ర‌త బిల్లు-2013, ఆధార్ కార్డు న‌మోదు ప్ర‌క్రియ అమలు తీరుపై ప్ర‌ధాన మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వీటి ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఫ‌లాల‌న్నీ ప్ర‌తి భార‌తీయ‌ పౌరుడికి నేరుగా, వేగంగా చేరేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని సూచించారు.